Indian Navy Agniveer SSR Admit Card: త్వరలోనే నేవీ అగ్నివీర్ ఎస్సెస్సార్ అడ్మిట్ కార్డ్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?

ABN , First Publish Date - 2022-09-25T21:56:42+05:30 IST

ఇండియన్ నేవీ ఎస్సెస్సార్ అగ్నివీర్ అడ్మిట్ కార్డ్ 2022 (Indian Navy SSR Agniveer Admit Card 2022)ను అధికారిక

Indian Navy Agniveer SSR Admit Card: త్వరలోనే నేవీ అగ్నివీర్ ఎస్సెస్సార్ అడ్మిట్ కార్డ్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?

న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ ఎస్సెస్సార్ అగ్నివీర్ అడ్మిట్ కార్డ్ 2022 (Indian Navy SSR Agniveer Admit Card 2022)ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ‘అతి త్వరలోనే’ విడుదల చేయనున్నట్టు మాత్రం తెలుస్తోంది. ఎగ్జామ్ కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల్లో చాలామంది తమ అడ్మిట్‌కార్డు అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడమెలానో తెలియక ఇబ్బంది పడుతున్నారు. 


ఇటువంటి వారు ‘జాయిన్ ఇండియన్ ఆర్మీ.జీవోవీ.ఇన్ (joinindiannavy.gov.in) వెబ్‌సైట్‌లోకి తమ ఈ-మెయిల్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవడం ద్వారా అడ్మిట్‌కార్డును చెక్ చేసుకుని ఇండియన్ నేవీ ఎస్సెస్సార్ అడ్మిట్ కార్డు 2022 (Indian Navy Agniveer SSR Admit Card 2022)ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎస్సెస్సార్ రిక్రూట్‌మెంట్ 2022 ఎగ్జామ్‌లో ముందు చెప్పినట్టుగానే సైన్స్, గణితం, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. 


ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం.. అగ్నివీర్ ఎస్సెస్సార్ అడ్మిట్‌కార్డు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. అడ్మిట్‌కార్డులను ఇండియన్ నేవీ పోస్టుద్వారా కానీ, ఇతర మాధ్యమాల ద్వారా ఎవరికీ పంపించదు. 


అడ్మిట్‌కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? 

* అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి

* హోం పేజీలో లాగిన్ ట్యాబ్‌పై క్లిక్ చేయలి 

* అప్పుడు కొత్త లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది

* అక్కడ మన రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి

* ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి

* ఆ తర్వాత మన అడ్మిట్ కార్డు‌ను చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవాలి 

* ఆ తర్వాత దానిని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి 

* అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు ఎగ్జామ్ డేట్, సమయం, రోల్ నంబరు, ఎగ్జామ్ సెంటర్, ఇతర సూచనలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట అడ్మిట్‌కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డును తీసుకెళ్లాలి. 

Updated Date - 2022-09-25T21:56:42+05:30 IST