Abn logo
Sep 20 2021 @ 07:25AM

America లో భారతీయుడి స్కాం.. ‘మెయిల్ ఫ్రాడ్’తో 70 మందికి పైగా బురిడీ కొట్టించాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..

వాషింగ్టన్: అమెరికాలో ఓ భారతీయుడికి అమెరికా కోర్టు భారీ జరిమానాతో పాటు సుదీర్ఘమైన జైలు శిక్ష విధించింది. హ్యూస్టన్‌లో అక్రమంగా నివశిస్తున్న సదరు వ్యక్తి మెయిల్ ఫ్రాడ్ చేసినట్లు తేలడంతో అతడికి భారీ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 37ఏళ్ల వసీమ్ మక్నోజియాకు 20 ఏళ్ల జైలు శిక్ష, అలాగే 2,50 వేల డాలర్లు(రూ.1,84 లక్షల పైగా) జరిమానా విధిస్తున్నట్లు అమెరికా తాత్కాలిక అటార్నీ వివరించారు. ఈ శిక్ష డిసెంబర్ 13 నుంచి అమలులోకి రానుంంది.

అమెరికా తాత్కాలిక అటార్నీ జెన్నిఫర్ బీ లోవరీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2019-అక్టోబర్ 2019 మధ్య కాలంలో మక్నోజియా ఓ టెలీమార్కెటింగ్ స్కీమ్‌లో పనిచేస్తూ ఇండియన్ కాల్ సెంటర్ ద్వారా అనేకమంది అమెరికన్ల నుంచి డబ్బులను దోచేశాడు. తానే ఈ స్కీమ్స్‌లను నడుపుతున్నట్లు బాధితులను నమ్మించిన మక్నోజియా.. తప్పుడు పేర్లు, నకిలీ పత్రాలతో బాధితులు చేసిన మెయిళ్లను దొంగిలించి దాదాపు 70కి పైగా డబ్బున్న పార్సిళ్లను దోచేశాడు. 

అక్కడితో ఆగకుండా ‘ఈ స్కీం విషయంలో ఫెడరల్ ఏజెంట్లు మీపై నిఘా పెట్టారం’టూ బాధితులను బ్లాక్‌మెయిల్ కూడా చేశాడు. ఆ తర్వాత తనను తాను ఏజెంట్‌గా పరిచయం చేసుకునే వ్యక్తి ఈ సమస్య నుంచి బయటపడాలన్నా, ఈ స్కీం స్కాంలో నుంచి తమ పేరు తొలగించుకోవాలన్నా బాధితులకు ఒక్కటే దారని, తమకు కొంత నగదు పంపించాలని డిమాండ్ చేసేవాడు. అది కూడా ఫెడ్ ఎక్స్ ద్వారా ఆ సొమ్మును పంపించాలని చెప్పేవారు. ఈ క్రమంలోనే మక్నోజియా వంటి వారు ఆ పార్సిళ్లను చేజిక్కించుకునేవారు. అయితే ప్రస్తుతం మక్నోజియాను అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచామని, అతడికి శిక్ష విధించడం పెండింగ్‌లో ఉందని తాత్కాలిక అటార్నీ లోవరీ వెల్లడించారు.

TAGS: America FRUAD

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...