Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీలంకలో పోలీస్ కస్టడీలో మృతిచెందిన భారత వ్యక్తి!

కొలంబో: బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడనే ఆరోపణలపై అరెస్టైన భారత వ్యక్తి పోలీస్ కస్టడీలోనే మృతి చెందిన ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... 45 ఏళ్ల భారతీయుడ్ని మార్చి 18న లంక పోలీసులు వాయువ్య ప్రావిన్స్‌లోని కులియాపిటియాలోని ఓ బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు అతడ్ని వారియోపోల జైలుకు తరలించారు. దాంతో అప్పటి నుంచి అతడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుండటంతో జైలు అధికారులు వారియోపోల ఆస్పత్రికి తీసుకువచ్చారు. మంగళవారం అతడు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతిచెందినట్టు చందన ఏకనాయక అనే జైలు అధికారి వెల్లడించారు. కాగా, మృతుడు 16 ఏళ్ల కిందే శ్రీలంకకు వలస వచ్చి, అక్కడి మహిళనే పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడినట్లు అధికారులు తెలిపారు. అయితే, మృతుడి వివరాలను మాత్రం జైలు అధికారులు వెల్లడించలేదు.        

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement