US లో భారతీయ యువకుడి అరెస్ట్.. నేరం రుజువైతే 24 ఏళ్ల జైలు..!

ABN , First Publish Date - 2022-06-12T15:23:49+05:30 IST

US ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తాజాగా వర్జీనియాకు చెందిన 24 ఏళ్ల భారత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

US లో భారతీయ యువకుడి అరెస్ట్.. నేరం రుజువైతే 24 ఏళ్ల జైలు..!

సీనియర్‌ సిటిజన్ల ఖాతాలే అతడి లక్ష్యం 

హ్యూస్టన్: US ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తాజాగా వర్జీనియాకు చెందిన 24 ఏళ్ల భారత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని సీనియర్‌ సిటిజన్ల ఖాతాలే లక్ష్యంగా అనిరుధ్‌ కల్‌కోటె(24) అనే భారత యువకుడు మోసాలకు పాల్పడ్డాడు. దీంతో అరెస్ట్ చేసిన అధికారులు శుక్రవారం హ్యూస్టన్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు. మహమ్మద్‌ ఆజాద్‌ (25) అనే వ్యక్తితో కలిసి అనిరుధ్‌ ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. ఆజాద్‌ను 2020లోనే అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి నేరాలు రుజువైతే వారికి 20 ఏళ్ల జైలు శిక్ష, 2.50లక్షల డాలర్ల(రూ.1.95కోట్లు) జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.


ఇక ఇదే కేసులో మరో ముగ్గురు భారతీయులు ఇంతకుముందే దోషులుగా తేలారు. సుమిత్ కుమార్ సింగ్(24), హిమాన్షు కుమార్(24), ఎండీ హసీబ్(26)ను హ్యూస్టన్ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి శిక్ష ఖరారు కావాల్సి ఉంది. వీరందరూ గతకొంతకాలంగా హ్యూస్టన్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్నారు. అనంతరం ముఠాగా ఏర్పడి వెస్ట్రన్‌ యూనియన్, మనీగ్రాం వంటి ట్రాన్స్‌మిటర్‌ బిజినెస్‌ల లింకులు పంపి వృద్ధులను బెదిరించి వారి ఖాతాల్లోని నగదును కొల్లగొట్టారు. 


Updated Date - 2022-06-12T15:23:49+05:30 IST