Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధికారుల కళ్లు గప్పి 3 నెలలు ఎయిర్​పోర్ట్​లోనే భారత వ్యక్తి.. నిర్దోషిగా తేల్చిన American కోర్టు!

వాషింగ్టన్: విమానాశ్రయాలు 24 గంటల పర్యవేక్షణ, తనిఖీలు, సెక్యూరిటీతో ఎంత పకడ్బందీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయాణికులందరిపై నిత్యం అక్కడి అధికారులు నిఘా ఉంచడం జరుగుతుంది. అలాంటి చోట ఓ భారత వ్యక్తి అధికారుల కళ్లు గప్పి ఏకంగా మూడు నెలలు తలదాచుకున్నాడు. చివరికి అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని చికాగో విమానాశ్రయం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసు అక్కడి స్థానిక కోర్టులో విచారణకు వచ్చింది. అయితే, న్యాయస్థానం భారత సంతతి వ్యక్తిని నిర్దోషిగా తేల్చింది. అతడు ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదని కుక్​ కౌంటీ జడ్జి ఆడ్రియెన్​ డేవిస్ స్పష్టం చేశారు​.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఆదిత్య సింగ్(37)​ అనే భారత సంతతి వ్యక్తి మాస్టర్స్​ డిగ్రీ కోసం 2015 అమెరికాకు వెళ్లారు. లాస్​ ఏంజిల్స్‌లో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో కరోనా విజృంభణ నేపథ్యంలో 2020 అక్టోబర్​ 19న భారత్‌కు వచ్చేందుకు చికాగోలోని ఓహేర్ ఎయిర్‌పోర్టుకు​ చేరుకున్నాడు. కానీ, వైరస్ భయంతో అక్కడి నుంచి ఎటూ వెళ్లకుండా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా అక్కడి సురక్షితమైన​ ఏరియాలోనే మూడు నెలలు తలదాచుకున్నాడు. అలు ఎయిర్‌పోర్టు అధికారుల కంటబడలేదు. ఈ క్రమంలో 2012 జనవరి 16న గుర్తింపు కార్డు చూపించమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడగడంతో అసలు విషయం బయటపడింది. ఏకంగా మూడు నెలల పాటు అతడు అనధికారికంగా అక్కడే ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు.

దీంతో ఆదిత్యను అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. ఇక గుర్తింపు కార్డు అడిగిన సిబ్బందికి ఆయన తన దగ్గర ఉన్న బ్యాడ్జి చూపించారు. అయితే, ఆ బ్యాడ్జి ఎయిర్​పోర్ట్ ఆపరేషన్స్ మేనేజర్‌ది కావడం, అక్టోబరు​లోనే సదరు మేనేజర్ అది పోయినట్టు ఫిర్యాదు చేయడం అధికారులు గుర్తించారు. దాంతో ఎయిర్‌పోర్టు నిషేధిత ప్రాంతంలో అక్రమంగా చొరబడటం, దొంగతనం చేసినట్లుగా ఆదిత్యపై ఎయిర్‌పోర్టు అధికారులు అభియోగాలు మోపారు. వెంటనే దీనిపై ఎయిర్​పోర్ట్​ భద్రతా విభాగం దర్యాప్తు చేపట్టింది. కానీ, నిషేధిత ప్రాంతంలో ఆదిత్య​ ఉన్నట్లు అధికారులు ఎలాంటి ఆధారాలు కనుగొనలేకపోయారు. తాజాగా ఈ కేసు కుక్ కౌంటీ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే, అధికారులు ఆదిత్యకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. దాంతో న్యాయస్థానం అతడ్ని నిర్దోషిగా తేల్చింది. ఆదిత్య ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదని జడ్జి ఆడ్రియెన్​ డేవిస్ వెల్లడించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement