Abn logo
Nov 1 2020 @ 04:39AM

ఆస్ట్రేలియాలో భారత సంతతి అన్నదాత

  • కరోనా సమయంలో అన్నార్తులకు అండ 
  • ఇంట్లోనే వంటలు.. రోజూ 150 మందికి భోజనం

మెల్‌బోర్న్‌, అక్టోబరు 31: ఆకలితో ఉన్నవారు పట్టెడన్నం తప్ప ఏం కోరుకుంటారు? మాయదారి కరోనా పంజా విసరడంతో ఫుట్‌పాత్‌లపై బతుకుతున్నవారు, ఉపాధి కోల్పోయినవారెంతోమంది ఒక్క పూట కడుపునిండా తిండికి కూడా నోచుకోలేకపోతున్నారు. అలాంటివారికి తన సొంత డబ్బు వెచ్చించి... రోజూ ఇంట్లో వంటలు చేసి ఆన్నదానం చేస్తున్నాడో సహృదయుడు! ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్న 54ఏళ్ల దమన్‌ శ్రీవాస్తవదీ ఔదార్యం. కరోనా తొలినాళ్ల నుంచి రోజూ ఇంట్లో 150 మందికి సరిపడా వంటలు చేసి.. ఆహార పదార్థాలను తన కారులో పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అన్నార్తులకు సరఫరా చేస్తున్నారు. ఆయనకు ఆరుగురు వలంటీర్ల బృందం సహకరిస్తోంది. ఇలా అన్నదానం చేయడం ఆయనకు కొత్తకాదు. 1990లో గల్ఫ్‌వార్‌తో సర్వం కోల్పోయిన వారి ఆకలి తీర్చి ఆదుకున్నారాయన. ప్రస్తుతం తన చొరవకు దాతలు సాయం చేస్తే.. పెద్ద ఎత్తున ఆహారపదార్థాలను వండి ట్రక్కు ద్వారా సరఫరా చేస్తానని, అప్పుడు మరింత మంది ఆకలి తీర్చినట్లవుతుందని సామాజిక మాధ్యమాల ద్వారా  కోరారు.

Advertisement
Advertisement