Saudi Arabia: ఒంటెను ఢీకొట్టిన వాహనం.. భారత వ్యక్తి మృతి!

ABN , First Publish Date - 2022-05-20T16:46:05+05:30 IST

పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన భారత ప్రవాసుడు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.

Saudi Arabia: ఒంటెను ఢీకొట్టిన వాహనం.. భారత వ్యక్తి మృతి!

రియాద్: పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన భారత ప్రవాసుడు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. సౌదీ అరేబియాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. భారత వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ఓ ఒంటెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారత ప్రవాసుడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సౌదీ పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని వినోజ్ గల్బర్ట్ జాన్(42)గా గుర్తించారు. వినోజ్ ఓ బ్రేడ్ తయారీ సంస్థలో పని చేస్తున్నట్లు తెలిసింది. అతని స్వస్థలం కేరళ రాష్ట్రం తిరువనంతపురమని పోలీసులు వెల్లడించారు. అక్కడి భారత ఎంబసీ అధికారులు, ఇండియన్ కమ్యూనిటీ సంఘాల సహాయం వినోజ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృతుడికి భార్య ఫెబి వినోజ్, కూతురు సోజ్ మేరీ వినోజ్ ఉన్నారు. వినోజ్ గల్బర్ట్ జాన్ మృతితో స్వస్థలం తిరువనంతపురంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.   

Updated Date - 2022-05-20T16:46:05+05:30 IST