Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒకరిద్దరు కాదు ఏకంగా 365 మంది భార్యలు.. ఈ ‘మగ మహారాజు’ స్టోరీ వింటే అవాక్కవాల్సిందే..!

భారతదేశ చరిత్రలో ఎంతో ఘనకీర్తిని గడించిన రాజులకు సంబంధించిన కథలు అనేక కనిపిస్తాయి. వీరిలో ఒకరే పాటియాలాకు చెందిన రాజు ‘మహారాజా భూపిందర్ సింగ్’ 1891 అక్టోబరు 12న జన్మించిన భూపిందర్ సింగ్ తన 9వ ఏటనే సింహాసనాన్ని అలంకరించారు. తన 18 వ ఏట రాజ్య భారాన్నంతా స్వీకరించారు. ఆయన 38 ఏళ్ల పాటు రాజ్యపాలన సాగించారని చరిత్ర చెబుతోంది. 

ఈ నేపధ్యంలో అతనికి సంబంధించిన అనేక విషయాలు ఈనాటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మహారాజా భూపిందర్ సింగ్‌కు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 365 మంది రాణులున్నారు. వీరిలోని 10 మంది రాణుల ద్వారా 83 మంది సంతానం కలిగారు. అయితే ఈ పిల్లలలో 53 మంది మాత్రమే బతికి బట్టకట్టారు. కాగా ఈ రాణులంతా ఎప్పుడూ ఏదోఒక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. దీంతో ఒక వైద్య బృందం వారిని అంటిపెట్టుకుని ఉండేదట. 

మహారాజా భూపిందర్‌కు 365 మంది భార్యలున్నందున వారి పేర్లతో 365 లాంతరు దీపాలను నిత్యం వెలిగించేవారు. వీటిలో ఏ లాంతరు దీపం త్వరగా ఆరిపోతుందో, ఆ రాణితో రాత్రంతా మహారాజా భూపిందర్ సింగ్ గడిపేవారు. ఈయన పాటియాలాలో లీలాభవన్ కట్టించారు. దుస్తులు లేకుండా వచ్చేవారికే ఈ భవనంలోకి వచ్చేందుకు అనుమతి నిచ్చేవారట.

పార్టీలను అమితంగా ఇష్టపడే ఈ రాజావారికి కార్లపై అమితమైన మోజు ఉండేది. అదేవిధంగా ఈ రాజావారు అత్యంత ఖరీదైన విమానం కూడా కొనుగోలు చేశారు. భారతదేంలో విమానం కొనుగోలు చేసిన తొలి రాజుగా భూపిందర్ చరిత్రలో నిలిచిపోయారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement