భారతీయుడికి జైలు శిక్ష విధించిన Singapore court.. తప్పతాగి అతడు చేసిన నేరం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-02-19T16:58:13+05:30 IST

సింగపూర్‌లోని కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్న 40ఏళ్ల భారతీయుడికి అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. తప్పతాగి అతడు చేసిన పనిపట్ల కోర్టు మండిపండి. ఈ నేపథ్యంలో కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. ఇందుకు

భారతీయుడికి జైలు శిక్ష విధించిన Singapore court.. తప్పతాగి అతడు చేసిన నేరం ఏంటంటే..

ఎన్నారై డెస్క్: సింగపూర్‌లోని కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్న 40ఏళ్ల భారతీయుడికి అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. తప్పతాగి అతడు చేసిన పనిపట్ల కోర్టు మండిపండి. ఈ నేపథ్యంలో కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



భారత్‌కు చెందిన సీని పరమశివమ్ అనే వ్యక్తి ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం సింగపూర్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2020 మార్చిలో కంపెనీ ప్రతినిధులతో పరమశివమ్ ఓ విషయంలో గొడవపడ్డారు. ఆ తర్వాత ఆ గొడవ సర్దుమనిగింది. అయితే నెల జీతం వచ్చిన తర్వాత కంపెనీలో డార్మెటరీలోనే అతడు మద్యం సేవించాడు. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులతో జరిగిన గొడవ అతడికి గుర్తొచ్చింది. దీంతో నేరుగా కంపెనీ బయట పార్క్ చేసిన లారీ వద్దకు వెళ్లాడు. అనంతరం లారీ ఇంజిన్‌లో మట్టి పోశాడు. మరుసటి రోజు ఉదయం లారీ ట్రబుల్ ఇవ్వడంతో మెకానిక్‌కు చూపించారు. లారీని పరిశీలించిన మెకానిక్.. కంపెనీ ప్రతినిధులకు సమస్యను వివరించాడు. ఈ క్రమంలోనే కంపెనీ ప్రతినిధులు.. సీసీ కెమెరాలను పరిశీలించారు. లారీ ఇంజిన్‌లో మట్టి పోసింది పరమశివమే అని నిర్ధారించుకుని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పరమశివమ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పరమశివమ్‌కు 12 వారాలా జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 




Updated Date - 2022-02-19T16:58:13+05:30 IST