చైనా యాప్‌ల నిషేధంపై భారత ఇంటర్నెట్ కంపెనీల హర్షం

ABN , First Publish Date - 2020-06-30T23:36:52+05:30 IST

యూసీ బ్రౌజర్, టిక్‌టాక్, క్లబ్ ఫ్యాక్టరీ తదితర 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంపై భారత ఇంటర్నెట్

చైనా యాప్‌ల నిషేధంపై భారత ఇంటర్నెట్  కంపెనీల హర్షం

న్యూఢిల్లీ: యూసీ బ్రౌజర్, టిక్‌టాక్, క్లబ్ ఫ్యాక్టరీ తదితర 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంపై భారత ఇంటర్నెట్ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. భారతీయ టెక్ కంపెనీలు తిరిగి పుంజుకోవడానికి, ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రచారం ఊపందుకోవడానికి ఈ నిర్ణయం చక్కగా పనికొస్తుందని పేర్కొన్నాయి.


ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ట్రెల్ సహ వ్యవస్థాపకుడు పులకిత్ అగర్వాల్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం ఆత్మనిర్భర్ భారత్‌కు చేరువగా తీసుకెళ్తుందని పేర్కొన్నారు. స్వేదేశీ యాప్స్ విప్లవం సృష్టిస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో తమలాంటి స్టార్ట్‌ప్ కంపెనీలు గొప్ప పాత్ర పోషిస్తాయన్నారు. డిజిటల్ ఇండియా విప్లవంలో భాగస్వాములం కావడానికి సిద్ధంగా ఉన్నట్టు అగర్వాల్ చెప్పారు.  

Updated Date - 2020-06-30T23:36:52+05:30 IST