IIT MANDIలో ఎంబీఏ

ABN , First Publish Date - 2022-07-05T22:46:49+05:30 IST

మండీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)(ఐఐటీ) - ఎంబీఏ ప్రోగ్రామ్‌(MBA program)లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌

IIT MANDIలో ఎంబీఏ

మండీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)(ఐఐటీ) - ఎంబీఏ ప్రోగ్రామ్‌(MBA program)లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌ స్పెషలైజేషన్‌ ‘డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌’. మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ప్రోగ్రామ్‌ మొత్తమ్మీద నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.

ప్రోగ్రామ్‌లోని అంశాలు: కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ అనాలిసిస్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, మేథమెటికల్‌ ఫౌండేషన్స్‌, క్రియేటివ్‌ థింకింగ్‌-ప్రాబ్లం సాల్వింగ్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, డెసిషన్‌ అనాలిసిస్‌, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, మేనేజీరియల్‌ ఎకనామిక్స్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, డేటా అనలిటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ ఫర్‌ బిజినెస్‌, లీగల్‌ అండ్‌ ఎథికల్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ బిజినెస్‌, న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ - లాజిక్‌ అండ్‌ ఎవల్యూషనరీ కంప్యూటింగ్‌ ఫండమెంటల్స్‌ ఫర్‌ బిజినెస్‌, డిజిటల్‌ బిజినెస్‌ స్ట్రాటజీ - మోడల్స్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌, ఏఐ అండ్‌ ఎంఎల్‌ ఇన్‌ ఫంక్షనల్‌ డిసిప్లిన్స్‌, ఫిన్‌టెక్‌, బ్లాక్‌ చెయిన్‌ ఫర్‌ బిజినెస్‌, డీప్‌ లెర్నింగ్‌ అండ్‌ నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ ఫర్‌ బిజినెస్‌   

అర్హత: రెండు కేటగిరీల్లో అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. మొదటి కేటగిరీ అడ్మిషన్స్‌కు సీఎ్‌ఫటీఐ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 70 శాతం మార్కులు ఉండాలి. వీరికి క్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ అవసరం లేదు. రెండో కేటగిరీ అడ్మిషన్స్‌కు ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. రెండు కేటగిరీలకు ఇంటర్‌ స్థాయిలో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్స్‌ అండ్‌ మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారికి మొదటి కేటగిరీ కింద  ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌ఆర్‌ఐ, విదేశీ విద్యార్థులకు జీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2400; దివ్యాంగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200; సార్క్‌ దేశస్థులకు 100 యూఎస్‌డీలు; నాన్‌ సార్క్‌ దేశస్థులకు 200 యూఎ్‌సడీలు

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూలై 17 

వెబ్‌సైట్‌: iitmandi.ac.in

Updated Date - 2022-07-05T22:46:49+05:30 IST