IITH నుంచి ‘హెరిటేజ్‌’లో ఎంటెక్‌

ABN , First Publish Date - 2022-07-01T20:02:36+05:30 IST

భారతదేశ ప్రాచీన వైజ్ఞానిక వారసత్వాన్ని అన్వేషించడానికి, స్మారక చిహ్నలు, పురావస్తు ప్రదేశాలు, దుస్తులు, విజ్ఞాన వ్యవస్ధలను దేశీయ సాంకేతికతతో వెలికితీసి ఆధునీకరించడానికి ఇండియన్‌

IITH నుంచి ‘హెరిటేజ్‌’లో ఎంటెక్‌

భారతదేశ ప్రాచీన వైజ్ఞానిక వారసత్వాన్ని అన్వేషించడానికి, స్మారక చిహ్నలు, పురావస్తు ప్రదేశాలు, దుస్తులు, విజ్ఞాన వ్యవస్ధలను దేశీయ సాంకేతికతతో వెలికితీసి ఆధునీకరించడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(Indian Institute of Technology Hyderabad) (ఐఐటీహెచ్‌)లో హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(Heritage Science and Technology)లో ఆన్‌లైన్‌ ఎంటెక్‌ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీనికి సంబంధించిన కొత్త డిపార్టుమెంట్‌ను దేఽశంలోనే తొలిసారిగా ఐఐటీహెచ్‌లో పద్మభూషణ్‌ డాక్టర్‌ విజయ్‌ భట్కర్‌ ప్రారంభించారు. వైజ్ఞానిక వారసత్వాన్ని అన్వేషించడంలో జరిపే పరిశోధనలో ఈ డిపార్ట్‌మెంట్‌ రాణిస్తుందన్న ఆశాభావాన్ని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి వ్యక్తం చేశారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2022-07-01T20:02:36+05:30 IST