IIFTలో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-08-13T20:40:51+05:30 IST

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(Indian Institute of Foreign Trade)(ఐఐఎఫ్‌టీ) - పలు మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్‌ పీజీ

IIFTలో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(Indian Institute of Foreign Trade)(ఐఐఎఫ్‌టీ) - పలు మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్‌ పీజీ డిప్లొమా, డిప్లొమా, ప్రొఫెషనల్‌ ట్రెయినింగ్‌, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి ఆన్‌లైన్‌ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు. 


ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)

ఈ ప్రోగ్రామ్‌ని వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించారు. ఇది ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌. దీని వ్యవధి రెండేళ్లు. ఇందులో ఆరు ట్రైమెస్టర్లు ఉంటాయి. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. మొదటి ఏడాది మేనేజ్‌మెంట్‌ స్ట్రాటజీ, ట్రేడ్‌ అండ్‌ ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌  అండ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ కోర్సులు చదవాల్సి ఉంటుంది. రెండో ఏడాది  ఫైనాన్స్‌ అండ్‌ ట్రేడ్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. ప్రోగ్రామ్‌లో భాగంగా వర్చువల్‌ సెషన్స్‌ ఉంటాయి. ప్రముఖ పారిశ్రామిక నిపుణులు గెస్ట్‌ లెక్చర్స్‌ ఇస్తారు. కేస్‌ స్టడీస్‌, ప్లాబ్లం సాల్వింగ్‌ విధానాలపై బృంద చర్చలు ఉంటాయి.  

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు. కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి.  

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.10,50,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 16 


ఎగ్జిక్యూటివ్‌ పీజీ డిప్లొమా (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)

ఈ ప్రోగ్రామ్‌ కోల్‌కతా క్యాంప్‌సలో అందుబాటులో ఉంది. ప్రోగ్రామ్‌ వ్యవధి 18 నెలలు. ఇందులో మూడు సెమిస్టర్లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌ని హైబ్రిడ్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి సెమిస్టర్‌ ప్రారంభంలో మొదటి వారం; రెండు, నాలుగు వారాంతాల్లో  క్యాంపస్‌ తరగతులు ఉంటాయి.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు జూలై 10 నాటికి కనీసం అయిదేళ్ల అనుభవం ఉన్నవారు; పీజీ/ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.3,60,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 25


డిప్లొమా (ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌)

ఇది ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌. ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. మూడు ట్రైమెస్టర్లు ఉంటాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా ట్రేడింగ్‌ పాలసీలు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫ్‌ క్యాపిటల్‌, ప్రొడ్యూసింగ్‌ అండ్‌ సోర్సింగ్‌ గూడ్స్‌, గ్లోబలైజేషన్‌, ట్రేడ్‌ అగ్రిమెంట్స్‌ తదితర కోర్సులతోపాటు ఫీల్డ్‌ విజిట్స్‌, అసైన్‌మెంట్స్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌లు ఉంటాయి. ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఆన్‌లైన్‌ సెషన్స్‌ నిర్వహిస్తారు.  

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. 

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.3.8లక్షలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 20


ప్రొఫెషనల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌ సప్లయ్‌ చెయిన్‌ అండ్‌ ట్రేడ్‌ లాజిస్టిక్స్‌

ఇది ఆర్నెల్ల వ్యవధి గల ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌. తొమ్మిది మాడ్యూల్స్‌ ఉంటాయి. వీటిలో సప్లయ్‌ చెయిన్‌కు సంబంధించిన ఫండమెంటల్స్‌, డిజైనింగ్‌, స్ట్రాటజీస్‌, సస్టయినబిలిటీ అండ్‌ టెక్నాలజీ, షిప్పింగ్‌ సర్వీసెస్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లాజిస్టిక్స్‌ తదితర అంశాలు వివరిస్తారు. కేస్‌ స్టడీస్‌, లైవ్‌ లెక్చర్స్‌, గ్రూప్‌ డిస్కషన్‌ అండ్‌ ప్రజంటేషన్‌ కూడా ఉంటాయి. 

అర్హత: ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు; డిప్లొమా పూర్తిచేసి కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.59,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 20


సర్టిఫికెట్‌  ప్రోగ్రామ్‌ ఇన్‌ పోర్ట్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

ఇది నాలుగు నెలల వ్యవధి గల ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌. వారాంతాల్లో  సెషన్స్‌ ఉంటాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా దేశంలోని ఏవైనా రెండు    సీ పోర్ట్‌లు దర్శించే అవకాశం కల్పిస్తారు.  

అర్హత: డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులు; మ్యారిటైం ప్రొఫెషనల్స్‌/ షిప్స్‌ ఆఫీసర్స్‌ అండ్‌ షోర్‌ బేస్డ్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌/ సప్లయ్‌ చెయిన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్‌; పీ అండ్‌ ఐ క్లబ్‌ మేనేజర్స్‌, పోర్ట్‌ అథారిటీస్‌, కోస్ట్‌ గార్డ్‌ పర్సనల్‌/ప్రొడ్యూసర్స్‌,  కార్గో అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రొవైడర్స్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.90,000 

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 27


ఎగ్జిక్యూటివ్‌ పీజీ డిప్లొమా (గ్లోబల్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌)

ఇది వీకెండ్‌ ప్రోగ్రామ్‌. ఢిల్లీ క్యాంప్‌సలో అందుబాటులో ఉంది. ప్రోగ్రామ్‌ వ్యవధి 18 నెలలు. వారాంతాల్లో ఫిజికల్‌ మోడ్‌లో తరగతులు నిర్వహిస్తారు. మొత్తం 120 సీట్లు ఉన్నాయి.


అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. పీజీ  లేదా ప్రొఫెషనల్‌ డిగ్రీ (లా/ ఇంజనీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ మెడిసిన్‌/ ఫార్మాస్యూటికల్‌/ అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌)పూర్తిచేసి కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు కూడా  అప్లయ్‌ చేసుకోవచ్చు. 

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.4,45,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

వెబ్‌సైట్‌: www.iift.ac.in

Updated Date - 2022-08-13T20:40:51+05:30 IST