హాంకాంగ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

ABN , First Publish Date - 2022-08-17T04:20:17+05:30 IST

హాంకాంగ్‌లో 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఘనంగా జరిగాయి.

హాంకాంగ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

హాంకాంగ్‌లో 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఘనంగా జరిగాయి. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, కాన్సుల్ జనరల్ మిస్ సత్వంత్ ఖనాలియా జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రసంగంలోని సారాంశాలను చదివి వినిపించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రవాస భారతీయుల ఉత్సాహం అంబరాన్ని అంటింది. సుర్ సాధన గ్రూప్ వారి దేశభక్తి గీతాలు, సలాంగై డ్యాన్స్ అకాడమీచే 'జై హో'పై భరతనాట్యం, శ్రీ శక్తి అకాడమీ వారిచే 'భారత్' కథక్‌లతో ప్రతిధ్వనించింది.


కాన్సుల్ జనరల్ మిస్ సత్వంత్ ఖనాలియా జనవరి 2022లో జరిగిన #AKAM క్విజ్‌లో విజేతలకు పతకాలను పంపిణీ చేసారు. #AzadiKaAmritMahotsav Celebrationsలో భాగంగా విశ్వ హిందీ దివస్ 2022ను 10 జనవరి 2022న జరుపుకున్నారు. కాన్సులేట్, టీకప్ ప్రొడక్షన్స్ సహకారంతో, అభివ్యక్తి పేరుతో హాంకాంగ్ & మకావు SARల నివాసితులు హిందీలో రాసిన 25 కథల సంకలనాన్ని ప్రచురించింది. ఆ పుస్తక సంపాదక సభ్యులని, కొందరు రచయితలను కాన్సుల్ జనరల్ సత్కరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమానికి మద్దతుగా హాంకాంగ్‌లోని ప్రవాసులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 'హర్ ఘర్ తిరంగ' సామూహిక ప్రచారంతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా, భారతదేశం పట్ల తమకున్న ప్రేమను, ప్రధానమంత్రి పట్ల తమకున్న మద్దతు, గౌరవాన్ని ప్రదర్శించారు.


OFBJP హాంగ్ కాంగ్ మరియు చైనాలు "హాంకాంగ్ భారతీయుల కోసం హర్ ఘర్ తిరంగ" ద్వారా #HarGharTirangaలో తమ భాగస్వామ్యాన్ని గర్వంగా ప్రకటించారు. OFBJP హాంకాంగ్, చైనా అధ్యక్షుడు సోహన్ గోయెంకా మాట్లాడుతూ 'భారతదేశాన్ని భారతీయుల వద్దకు తీసుకెళ్లడం' మా లక్ష్యం. హాంకాంగ్‌లోని ప్రతి భారతీయుడికి త్రివర్ణ పతాకాన్ని పంపిణీ చేస్తున్నాం. OFBJP హాంకాంగ్ మరియు చైనా ప్రతి భారతీయుడి ఇళ్లు మరియు కార్యాలయాలకు 6000 కంటే ఎక్కువ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశాయి. 


హాంకాంగ్‌లో స్థిరపడిన భారతీయులంతా మాతృభూమిని కీర్తిస్తూ స్వాతంత్య్ర అమృత మహోత్సవాన్ని సంతోషంగా జరుపుకున్నారు. ఉపాధ్యక్షుడు, రాజు సబ్నానీ, రమాకాంత్ అగర్వాల్, అజయ్ జకోటియా, రాజు షా, కుల్దీప్ ఎస్. బుట్టార్, సోనాలి వోరా ప్రచారానికి మద్దతుగా నిలిచారు. వారి కృషి మరియు అంకితభావం వల్ల హాంకాంగ్‌లో 'హర్ ఘర్ తీరంగా' ప్రచారం విజయవంతంగా సాధ్యమైంది. OFBJP హాంకాంగ్ మరియు చైనా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ మాట్లాడుతూ.. ఈ ప్రచారంతో విదేశాలలో ఉన్న భారతీయులను, స్వదేశంలో ఉన్న వారితో ఏకం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం’లో భాగంగా వేలాది మంది ఎన్నారైలు పాల్గొని దేశం పట్ల ప్రేమతో తమ ఇళ్లలో, కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు. 









Updated Date - 2022-08-17T04:20:17+05:30 IST