భారత్ ఓ చెత్త దేశం.. అమెరికా లా ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు..!

ABN , First Publish Date - 2022-04-13T01:50:15+05:30 IST

అమెరికాలోని ఓ న్యాయవిద్య ప్రొఫెసర్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ఓ చెత్త దేశమంటూ నోరు పారేసుకున్నారు.

భారత్ ఓ చెత్త దేశం.. అమెరికా లా ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు..!

ఎన్నారై డెస్క్: అమెరికాలోని ఓ న్యాయవిద్య ప్రొఫెసర్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ఓ చెత్త దేశమంటూ నోరు పారేసుకున్నారు. ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ ఏమీ వ్యాక్స్ మాట్లాడుతూ.. భారతీయులనూ అభ్యంతరకర రీతిలో విమర్శించారు. ‘‘భారత్ ఓ చెత్త దేశమైనప్పటికీ.. భారతీయులు అమెరికాకు వచ్చి ఇక్కడి పరిస్థితులపై విమర్శలు చేన్తుంటారు’’ అని అన్నారు. పాశ్చాత్య దేశాల వారి విజయాలను చూసి ఇతరులు అసూయ, వ్యతిరేకత పెంచుకుంటారని, తమ స్థితి చూసుకుని సిగ్గుపడతారని అన్నారు. 


‘‘పాశ్చాత్యదేశాల వారు సాధించిన అనూహ్య విజయాల కారణంగా ఇతరులు తమని తాము చూసుకుని సిగ్గుపడతారు. పాశ్చాత్యులపై క్రోధం, అసూయలను పెంచుకుంటారు. దీన్ని అస్సలు భరించలేం’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ‘‘బ్రాహ్మణులకు తామే అందరికంటే ఉన్నతులమనే విషయాన్ని నేర్పుతారు. మరి వాళ్ల దేశం ఎందుకంత చెత్తగా ఉందో..?’’ అని కూడా ఆమె అన్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. శుక్రవారం ఫాక్స్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏమీ వ్యాక్స్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో న్యాయవిద్య ప్రొఫెసర్‌గా ఉన్నారు. అయితే..ఆమె గతంలోనూ అమెరికాలోని వలసదారులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. 



Updated Date - 2022-04-13T01:50:15+05:30 IST