ఎన్నారైలపట్ల సానుకూలంగా స్పందించిన భారత ప్రభుత్వం..!

ABN , First Publish Date - 2020-05-22T22:17:09+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ఎన్నారై(ఓసీఐ కార్డు దారులకు)ల విషయంలో భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం గతంలో తీసు

ఎన్నారైలపట్ల సానుకూలంగా స్పందించిన భారత ప్రభుత్వం..!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ఎన్నారైల(ఓసీఐ కార్డు దారుల) విషయంలో భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఓసీఐ కార్డుదారుల పిల్లలు భారత్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది.. కష్టకాలంలో భారత్‌‌లో అడుగుపెట్టాలన్న ఆశ ఓ వైపు.. పిల్లలను వదిలి ఎలా వెళ్లాలన్న బెంగ మరోవైపు.. ఎన్నారైలను ఇబ్బందులకు గురిచేసింది.. ఎన్నారైల సమస్య కేంద్రం దృష్టికి వెళ్లడంతో తాజాగా ఆ నిబంధనల్లో మార్పులు చేస్తూ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఓసీఐ కార్డుదారుల పిల్లలను కూడా భారత్‌కు తీసుకొచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను భారత ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 


1.లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ఓసీఐ కార్డుదారులతోపాటు.. అక్కడే పుట్టి పెరిగిన వారి పిల్లలు(18 ఏళ్లలోపు వయసు కలిగిన వారు) కూడా.. ఇండియాకు రావడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


2. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినా, అత్యవసరం ఉన్న వారు ఇండియాకు రావొచ్చని పేర్కొంది. 


3. భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరికి ఓసీఐ కార్డు ఉన్నా భారత్‌కు రావచ్చు. అయితే మరో భాగస్వామి భారతీయ పౌరుడై ఉండాలి. వారికి భారత్‌లోనే శాశ్వత నివాసం కలిగి ఉండాలి.


4. ఓసీఐ కార్డుదారులై ఉండి విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు(మైనర్లు కాదు) భారత్‌కు వచ్చేందుకు అర్హులు.. వారి తల్లిదండ్రులు భారతీయులై ఉండి.. భారత్‌లోనే నివసిస్తున్నవారై ఉండాలి. ఈ నిబంధనల్లో పేర్కొన్న వారు భారత్‌కు తిరిగి వచ్చేందుకు అర్హులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.




Updated Date - 2020-05-22T22:17:09+05:30 IST