Abn logo
Sep 10 2021 @ 08:08AM

భారత గోల్ఫర్‌కు యూఏఈ Golden Visa

దుబాయ్: ప్రముఖ భారత గోల్ఫర్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత జీవ్ మిల్కా సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ మిల్కాను పదేళ్ల గోల్డెన్ వీసాతో సత్కరించింది. గోల్ఫ్‌లో దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు యూఏఈ గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఇక చాలా ఏళ్లుగా దుబాయ్‌తో అసోసియేట్ అవుతున్న మిల్కా అక్కడ పలు ప్రపంచ టోర్నీలలో సత్తా చాటారు. 2001లో నిర్వహించిన దుబాయ్ డిసెర్ట్ క్లాసిక్‌లో ఆయన వరల్డ్ రికార్డు నమోదు చేశారు. కేవలం 94 పుట్స్‌తోనే నాలుగు రౌండ్లు పూర్తి చేసిన మిల్కా.. ఆరో స్థానంలో నిలిచారు. 


అలాగే మిల్కా సింగ్ ఇప్పటివరకు యూరోపియన్ టూర్‌లో నాలుగు టైటిల్స్, జపాన్ గోల్ఫ్ టూర్‌లో మరో నాలుగు టైటిల్స్, ఏషియన్ టూర్‌లో ఆరు టైటిల్స్ సాధించారు. ఇలా గోల్ఫ్‌లో ఆయన సాధించిన విజయాలకు గుర్తింపు తాజాగా యూఏఈ ప్రభుత్వం ఆయనకు 10 ఏళ్ల గోల్డ్ కార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా మిల్కా సింగ్ మాట్లాడుతూ.. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు. 1993లో తొలిసారి దుబాయ్ వచ్చాయని, అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రతిక్షణాన్ని ఆస్వాదించానంటూ చెప్పుకొచ్చారు. 


ఇవి కూడా చదవండి..

Texasలో హాట్ టాపిక్.. ఈ రెస్టారెంట్ Wifi పాస్‌వర్డ్ ఏంటో మీరు చెప్పగలరా..?

ఫ్లాట్‌లో NRI భార్య దారుణ హత్య.. విదేశాల్లో ఉన్న భర్త.. ‘టీ కప్పుల’తో వీడిన మర్డర్ మిస్టరీ..! 


తన కుటుంబం కూడా దుబాయ్‌లో బాగా ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. ఇక్కడి వెరైటీ రెస్టారెంట్స్ అందులో దొరికే వివిధ రకాల ఆహార పదార్థాలు తన కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టమన్నారు. అలాగే ఇక్కడి షాపింగ్ మాల్స్ కూడా తమను విపరీతంగా ఆకర్షించినట్లు పేర్కొన్నారు. ఇక గోల్ఫ్ ఆటగాడిగా తనకు దుబాయ్‌లో గోల్ఫ్ కోర్సులకు సంబంధించిన నాణ్యత, గోల్ఫ్ కోర్సుల నిర్వాహకులు సాధన కోసం ఏర్పాటు చేసే సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయని మిల్కా సింగ్ తెలిపారు.  


తాజా వార్తలుమరిన్ని...