టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఖైదీ

ABN , First Publish Date - 2020-08-03T00:34:40+05:30 IST

‘1983లో వాడిన ఇదే సినిమా టైటిల్‌తో, కార్తీ హీరోగా సుమారుగా 36 సంవత్సరాల తర్వాత తీసిన సినిమా ఖైదీ. ఈ టైటిల్లో ఉన్న కిక్ ఏంటో గానీ, అప్పటికే ఫ్లాపులతో సతమతమవుతోన్న హీరో కార్తీ.. ఈ చిత్రంతో సైలెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఖైదీ సినిమా విడుదల సమయానికి సినిమా మీద ఎవరికీ పెద్ద ఆశలు లేవు.

టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఖైదీ

 న్యూఢిల్లీ : ‘1983లో వాడిన ఇదే సినిమా టైటిల్‌తో, కార్తీ హీరోగా సుమారుగా 36 సంవత్సరాల తర్వాత తీసిన సినిమా ఖైదీ. ఈ టైటిల్లో ఉన్న కిక్ ఏంటో గానీ, అప్పటికే ఫ్లాపులతో సతమతమవుతోన్న హీరో కార్తీ.. ఈ చిత్రంతో సైలెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఖైదీ సినిమా విడుదల సమయానికి సినిమా మీద ఎవరికీ పెద్ద ఆశలు లేవు.


ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రమే. మరో ప్రక్క విజయ్ చిత్రం.. బిగిల్ రిలీజ్ అయ్యి మాస్ హిట్ అనిపించుకుంటోంది. దీంతో... మరో ఫ్లాఫ్ కార్తీ ఖాతాలో పడిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలై పోయింది. కానీ అప్పుడే మిరాకిల్ జరిగింది.. క్రమక్రమంగా ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరగడం మొదలయ్యాయి. కాగా ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై, ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు.


కాగా... 2019 సంవత్సరానికి గాను ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఖైదీ చిత్రం ఎంపికైన నేపధ్యంలో... ఈ మూవీని కెనడాలో ఈ నెల 9-15వ తేదీల్లో... జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో భాగంగా, ఈ నెల 12 వ తేదీన టోరంటోలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. 

Updated Date - 2020-08-03T00:34:40+05:30 IST