ఒక్క చాన్స్ కోసం ఎదురుచూస్తున్నా: ఇషాంత్

ABN , First Publish Date - 2020-08-08T21:36:32+05:30 IST

ఒక్క ప్రపంచ కప్‌‌లో జతీయ జట్టుకు ఆడాలని ఉందని భారత పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ అన్నాడు. రెండు సార్లు అవకాశం చేజారిపోయిందని, ఈసారి కచ్చితంగా జట్టులో స్థానం పొందేవిధంగా సిద్ధమౌతున్నానని..

ఒక్క చాన్స్ కోసం ఎదురుచూస్తున్నా: ఇషాంత్

న్యూఢిల్లీ: ఒక్క ప్రపంచ కప్‌‌లో జతీయ జట్టుకు ఆడాలని ఉందని భారత పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ అన్నాడు. రెండు సార్లు అవకాశం చేజారిపోయిందని, ఈసారి కచ్చితంగా జట్టులో స్థానం పొందేవిధంగా సిద్ధమౌతున్నానని అన్నాడు. ఇటీవల జరీగిన ఓ ఇంటర్వ్యూలో ఇషాంత్ పాల్గొన్నాడు. అందులో తన క్రికెట్ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు. ‘ప్రపంచ కప్‌ టోర్నీలో ఆడేందుకు ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పటికే మూడుసార్లు ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం కోల్పోయాను. ఈ సారి మాత్రం అలాకాకూడదని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. 2023లో జరిగే ప్రపంచ కప్ గెలవాలి. ఆ జట్టులో నేను ఉండాల’ని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే 2007 అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇషాంత్ అడుగు పెట్టాడు. అయితే 2011 ప్రపంచ కప్‌ జట్టుకు బీసీసీఐ అతడిని ఎంపిక చేయలేదు. ఆ తరువాత 2015లో మోకాలి గాయం కారణంగా పోటీ నుంచి వైదొలిగాడు. 2019లోనూ ఇషాంత్‌కు జట్టలో స్థానం దొరకలేదు. అయితే ఇప్పటికే ఇషాంత్ వయసు 31. వచ్చే ప్రపంచ కప్ సమయానికి 34 ఏళ్లవాడవుతాడు. అయితే ఆ వయసులో ఇషాంత్‌ను బీసీసీఐ జట్టులోకి ఎంపిక చేస్తుందా. ఇప్పటికే బ్యాట్స్‌మన్ సరేష్ రైనా(33) , బౌలర్ అమిత్ మిశ్రా(36) జట్టులో స్థానం లభించడం కష్టమయింది. మరీ ఇషాంత్ శర్మ విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

Updated Date - 2020-08-08T21:36:32+05:30 IST