మ‌హారాష్ట్ర‌కు విమానం న‌డ‌పాల‌ని.. యూఏఈలో చిక్కుకున్న భార‌తీయుల విన్న‌పం..

ABN , First Publish Date - 2020-05-30T14:23:16+05:30 IST

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల యూఏఈలో చిక్కుకున్న భార‌తీయులు.. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌కు చెందిన ప్ర‌వాసులు త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక విమానం న‌డ‌పాల‌ని కోరుతున్నారు.

మ‌హారాష్ట్ర‌కు విమానం న‌డ‌పాల‌ని.. యూఏఈలో చిక్కుకున్న భార‌తీయుల విన్న‌పం..

యూఏఈ: క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల యూఏఈలో చిక్కుకున్న భార‌తీయులు.. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌కు చెందిన ప్ర‌వాసులు త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక విమానం న‌డ‌పాల‌ని కోరుతున్నారు. 450 మంది నిరుద్యోగ‌లు, 35 మంది గ‌ర్బిణీలు, మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఉన్న‌వారు, విజిట్ వీసాపై వచ్చి చిక్కుకుపోయిన వారు ఇలా 850 మందికి పైగా యూఏఈలో ఇరుక్కుపోయార‌ని వారు తెలిపారు. 'వందే భార‌త్ మిష‌న్‌' రెండో ద‌ఫాలో యూఏఈ నుంచి భార‌త్‌లోని వివిధ గ‌మ్య‌స్థానాల‌కు 80కి పైగా విమానాలు న‌డిపిన భార‌త ప్ర‌భుత్వం... మ‌హారాష్ట్ర‌లోని ఏ ఒక్క డెస్టినేష‌న్‌కు విమానాలు వేయ‌లేద‌ని ప్ర‌వాసులు పేర్కొన్నారు.   


ఇక అజ్మాన్‌లో ఉండే ముంబైకి చెందిన శుభంగి స‌కా అనే వ్య‌క్తి యూఏఈలో చిక్కుకుపోయిన మ‌హారాష్ట్ర ప్ర‌వాసుల‌తో రెండు వారాల క్రితం ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాడు. ప్ర‌స్తుతం ఇప్పుడు ఈ గ్రూపులో సుమారు 850 మంది ఉన్నారు. వీరిలో 450 మంది నిరుద్యోగ‌లు, 35 మంది గ‌ర్బిణీలు, మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఉన్న‌వారు, విజిట్ వీసాపై వచ్చి చిక్కుకుపోయిన వారు, వృద్ధులు  ఉన్నారు. ప్ర‌స్తుతం వీరంతా దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నార‌ని శుభంగి తెలిపారు. 


"కమ్యూనిటీ గ్రూపులు వారికి ప్రాథమిక సౌకర్యాలతో సహాయం చేస్తున్నాయి. మేము ఇక్కడ మిషన్లు, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర అధికారులను సంప్రదించాము". కానీ, ఎలాంటి ఫ‌లితం లేదు. క‌నుక భార‌త ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి త‌మ‌ను స్వ‌దేశానికి తీసుకెళ్లాల‌ని వారు కోరుతున్నారు.  

Updated Date - 2020-05-30T14:23:16+05:30 IST