Dubai Duty Free Raffle: 20 ఏళ్ల నుంచి లాటరీ టికెట్ కొంటున్న భారతీయుడు.. అదృష్టం వరించడంతో జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నాడంటే..

ABN , First Publish Date - 2022-07-21T16:00:49+05:30 IST

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ అనేది కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది.

Dubai Duty Free Raffle: 20 ఏళ్ల నుంచి లాటరీ టికెట్ కొంటున్న భారతీయుడు.. అదృష్టం వరించడంతో జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నాడంటే..

దుబాయ్: అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ అనేది కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఇలా జీవితంలో ఒక్కసారి లాటరీ తగిలితే చాలు అనుకునే వారు కోకొలల్లలు. ఇక అలాంటి వారికి లాటరీ తగిలితే.. నిన్నటివరకు సాదాసీదా జీవితం గడిపినవారు రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా అవతరిస్తుంటారు. అలాంటి అదృష్టమే తాజాగా దుబాయ్‌లో ఓ భారత ప్రవాసుడికి వరించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో (Dubai Duty Free Millennium Millionaire draw) రెహోబోత్ డానియల్ అనే భారత వ్యక్తి ఏకంగా 1 మిలియన్ డాలర్లు(రూ.8కోట్లు) గెలుచుకున్నాడు. 


బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ (Dubai Duty Free) డ్రాలో డానియల్ విజేతగా నిలిచాడు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ లాటరీ టికెట్ నం.1002కు ఈ జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే అతడి బ్యాంక్ ఖాతాలోకి రూ.8కోట్లు వచ్చిపడ్డాయి. దుబాయ్‌లో ఓ బుక్ షాప్ యజమాని అయిన 63 ఏళ్ల డానియల్ 20 ఏళ్ల నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటానని తెలిపాడు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. “ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ధన్యవాదాలు. మీ ప్రమోషన్ చాలా మందికి సహాయం చేస్తోంది. ఇది చాలా కాలం పాటు కొనసాగాలని ప్రార్థిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2022-07-21T16:00:49+05:30 IST