డ్యూటీలో ఉండగా భారత వ్యక్తికి ఫోన్‌కాల్.. అవతలి వారు చెప్పింది విని ఆయనలో ఎక్కడలేని ఆనందం.. అసలేం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-11T15:14:40+05:30 IST

డిసెంబర్ 9 యూఏఈలో ఉండే ఓ భారత వ్యక్తి జీవితంలో తీపి గుర్తుగా మిగిలిపోయింది.

డ్యూటీలో ఉండగా భారత వ్యక్తికి ఫోన్‌కాల్.. అవతలి వారు చెప్పింది విని ఆయనలో ఎక్కడలేని ఆనందం.. అసలేం జరిగిందో తెలిస్తే..

దుబాయ్: డిసెంబర్ 9 యూఏఈలో ఉండే ఓ భారత వ్యక్తి జీవితంలో తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఆ రోజు ఉదయం ఆఫీసుకు హడావుడిగా బయల్దేరిన ఆయనకు కొద్దిసేపటి తర్వాత ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఫోన్‌లో అవతలి వారు చెప్పింది విన్నాక భారతీయుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టరాని ఆనందంతో ఎగిరిగంతేసినంత పని చేశారాయన. ఇంతకు ఆయనకు ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అవతలి వారు ఆయనకు ఏం చెప్పారు? అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


హరుణ్ షేక్ గత కొంతకాలంగా దుబాయ్‌లో ఉంటున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల అబుధాబి బిగ్ టికెట్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఆ టికెటే ఆయనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. హరుణ్ కొనుగోలు చేసిన టికెట్ నంబర్‌కు ఏకంగా 1మిలియన్ దిర్హమ్స్(రూ.2.06కోట్లు) లాటరీ తగిలింది. గురువారం తీసిన డ్రాలో హరుణ్ ఇలా రూ.2.06కోట్లు గెలుచుకున్నారు. దీంతో విజేతగా నిలిచిన ఆయనకు బిగ్ టికెట్ హోస్ట్ రిచర్డ్ ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే, మొదట హరుణ్ నమ్మలేదు. ఎవరో కావాలనే ఫ్రాంక్‌కాల్ చేసి ఆటపట్టిస్తున్నారని అనుకున్నారట. 


కానీ, అవతలి వ్యక్తి ఆయన కొన్న లాటరీ టికెట్ నంబర్‌తో సహా చెప్పడంతో హరుణ్ ఆనందానికి అవధుల్లేవు. అలా డ్యూటీలో ఉండగా ఆయనకు ఫోన్‌కాల్ రావడం.. అది కాస్తా తనను కోటీశ్వరుడిని చేయడంతో హరుణ్ సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేశారు. ఇక సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్దామని తన కారు దగ్గరికి వచ్చిన హరుణ్‌కు రిచర్డ్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన గెలుచుకున్న రూ.2.06కోట్ల చెక్‌తో నేరుగా అక్కడికే వచ్చేశారు. అంతే.. హరుణ్‌లో పట్టరాని ఆనందం. తాను గెలిచిన ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని చారిటీ కోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-12-11T15:14:40+05:30 IST