యూఏఈలో పాస్‌పోర్ట్ పొగొట్టుకున్న భారతీయుడు.. రెండు దశాబ్దాల తర్వాత..

ABN , First Publish Date - 2020-09-24T06:54:48+05:30 IST

యూఏఈలో రెండు దశాబ్దాల నుంచి అక్రమంగా జీవిస్తూ వచ్చిన ఓ ప్రవాస భారతీయుడు ఎట్టకేలకు ఎటువంటి ఓవర్ స్టే జరిమానా చెల్లించకుండానే భారతదేశానికి రాగలుగుతున్నాడు. వివరంగా చెప్పాలంటే.. తమిళనాడుకు చెందిన థనవేల్ మథియాలాగన్(56) అనే వ్యక్తి 2000వ సంవత్సరంలో ఉద్యోగం కోసమని ఓ ఏజెంట్ ద్వారా యూఏఈ వెళ్లాడు.

యూఏఈలో పాస్‌పోర్ట్ పొగొట్టుకున్న భారతీయుడు.. రెండు దశాబ్దాల తర్వాత..

దుబాయి: యూఏఈలో రెండు దశాబ్దాల నుంచి అక్రమంగా జీవిస్తూ వచ్చిన ఓ ప్రవాస భారతీయుడు ఎట్టకేలకు ఎటువంటి ఓవర్ స్టే జరిమానా చెల్లించకుండానే భారతదేశానికి రాగలుగుతున్నాడు. వివరంగా చెప్పాలంటే.. తమిళనాడుకు చెందిన థనవేల్ మథియాలాగన్(56) అనే వ్యక్తి 2000వ సంవత్సరంలో ఉద్యోగం కోసమని ఓ ఏజెంట్ ద్వారా యూఏఈ వెళ్లాడు. యూఏఈ వెళ్లిన వెంటనే ఏజెంట్ థనవేల్ పాస్‌పోర్ట్ తీసుకుని కనిపించకుండా పోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక.. ఇంట్లో వారికి డబ్బు పంపేందుకు అక్కడే అక్రమంగా జీవిస్తూ వచ్చాడు. ఇక కరోనా నేపథ్యంలో థనవేల్ భారత్‌కు వచ్చేయాలని ప్రయత్నాలు చేశాడు.


ఇదే సమయంలో భారత్‌కు చెందిన ఇద్దరు సోషల్ వర్కర్లు థనవేల్‌కు అండగా నిలబడ్డారు. థనవేల్ పరిస్థితిని ఇండియన్ ఎంబసీకి చెప్పి ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించారు. పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న లేక పాస్‌పోర్ట్ లేని భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ను అందజేస్తారు. అయితే థనవేల్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లలో తండ్రి పేరు తప్పుగా ఉన్నట్టు ఎంబసీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ తప్పును సరిచేసే పనిలో ఉన్నట్టు.. అతి కొద్ది రోజుల్లోనే థనవేల్ భారత్‌కు రానున్నట్టు థనవేల్‌కు సహాయం చేసిన సోషల్ వర్కర్లు ఏకే మహదేవన్, చంద్ర ప్రకాష్ చెప్పారు. ఇక యూఏఈలోని ఇండియన్ అంబాసడర్ పవన్ కపూర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగా.. థనవేల్ రెండు దశాబ్దాల నుంచి అక్రమంగా యూఏఈలో ఉంటున్నందుకు అక్కడి ప్రభుత్వానికి 7.5 లక్షల దిర్హామ్‌(రూ. కోటి 50 లక్షలు)ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇండియన్ ఎంబసీ చొరవ తీసుకోవడంతో థనవేల్ ఎటువంటి జరిమానా లేకుండా స్వదేశానికి చేరుకోగలుగుతున్నాడు.

Updated Date - 2020-09-24T06:54:48+05:30 IST