త్వరలో ఉక్రెయిన్‌ రాజధానిలో భారతీయ ఎంబసీ కార్యకలాపాలు పునః ప్రారంభం!

ABN , First Publish Date - 2022-05-14T02:58:22+05:30 IST

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయ ఎంబసీ మే 17 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని పేర్కొంది.

త్వరలో ఉక్రెయిన్‌ రాజధానిలో భారతీయ ఎంబసీ కార్యకలాపాలు పునః ప్రారంభం!

ఎన్నారై డెస్క్: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తాత్కాలికంగా పొరుగు దేశమైన పోలాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయ ఎంబసీ మే 17 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని పేర్కొంది. రాజధానిపై బాంబుల దాడి పెరడంతో కేంద్రం ఫిబ్రవరిలో రాయబార కార్యాలయ్యాన్ని తరలించింది. అప్పట్లో.. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రష్యా సైనిక చర్య చర్చకు వచ్చింది. ఈ సమావేశం జరిగిన అనంతరం.. విదేశాంగ శాఖ ఎంబసీని పోలాండ్‌కు తరలిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన విషయం తెలిసిందే. రష్యా భద్రత కోసమే ఈ సైనిక చర్య చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పట్లో ప్రకటించారు. 

Read more