వ్యాలీడ్ కాంటాక్ట్ ఇవ్వండి: భారత ఎంబసీ

ABN , First Publish Date - 2020-09-27T17:38:04+05:30 IST

భారత ప్రవాసులు ఎవరైతే రాయబార కార్యాలయాన్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన వ్యాలీడ్ కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలని కువైట్‌లోని భారత ఎంబసీ కోరింది.

వ్యాలీడ్ కాంటాక్ట్ ఇవ్వండి: భారత ఎంబసీ

కువైట్ సిటీ: భారత ప్రవాసులు ఎవరైతే రాయబార కార్యాలయాన్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన వ్యాలీడ్ కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలని కువైట్‌లోని భారత ఎంబసీ కోరింది. రాయబార కార్యాలయానికి భారీ సంఖ్యలో ఈ-మెయిల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పిన ఎంబసీ.. వాటిలో సరియైన కాంటాక్ట్ వివరాలను పేర్కొనడం లేదని తెలిపింది. పాస్‌పోర్టులో ఉన్న పూర్తి పేరు, పాస్‌పోర్టు నెంబర్, సివిల్ ఐడీ వివరాలు, కాంటాక్ట్ మొబైల్ నెంబర్ మరియు చిరునామాను తెలియజేయాలని రాయబార కార్యాలయం కోరింది. అలాగే గ్రూపు అసోసియేషన్స్ నుంచి ఈ-మెయిల్స్ పంపించేవారు కూడా పూర్తి వివరాలను తెలియజేయాలని ఎంబసీ పేర్కొంది.  

Updated Date - 2020-09-27T17:38:04+05:30 IST