కరోనా ఎఫెక్ట్.. రిపబ్లిక్ డే వేడుకలపై Kuwait లోని భారత ఎంబసీ కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2022-01-21T16:55:48+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తాజాగా కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం రిపబ్లిక్ డే వేడుకలపై కీలక ప్రకటన చేసింది.

కరోనా ఎఫెక్ట్.. రిపబ్లిక్ డే వేడుకలపై Kuwait లోని భారత ఎంబసీ కీలక ప్రకటన!

కువైత్ సిటీ: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తాజాగా కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం రిపబ్లిక్ డే వేడుకలపై కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కోవిడ్-19 ప్రొటోకాల్, నిబంధనలను అనుసరిస్తూ 2022 జనవరి 26న వర్చువల్ విధానంలో రిపబ్లిక్ డే నిర్వహిస్తామని రాయబారి సీబీ జార్జ్ వెల్లడించారు. కనుక బుధవారం(జనవరి 26) నాడు భారత ప్రవాసులు ఎవరూ ఎంబసీ వద్దకు రావొద్దని తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు రాయబారి భారత జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందేశాన్ని చదివి వినిపిస్తారని ఈ సందర్భంగా ఎంబసీ పేర్కొంది.


ఇక ఆన్‌లైన్ వేదికగా జరిగే ఈ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంబసీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా సైట్స్‌లో ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. కనుక భారత ప్రవాసులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఈ లైవ్‌లో జాయిన్ కావొచ్చని రాయబార కార్యాలయం వెల్లడించింది. జూమ్‌లో https://zoom.us/j/91063589125?pwd=SlpnWmZsWG9SSHF5RTFZd2hPU2Ezdz09 లింక్ ద్వారా జాయిన్ కావొచ్చని ఎంబసీ తెలిపింది.     

Updated Date - 2022-01-21T16:55:48+05:30 IST