కువైత్‌లో Indian Embassy ఆధ్వర్యంలో యోగా డే సెలబ్రేషన్స్

ABN , First Publish Date - 2022-06-21T14:56:26+05:30 IST

కువైత్‌లోని Indian Embassy 8వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాయబార కార్యాలయంలో నేడు(మంగళవారం) ప్రత్యేక వేడుక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

కువైత్‌లో Indian Embassy ఆధ్వర్యంలో యోగా డే సెలబ్రేషన్స్

కువైత్ సిటీ: కువైత్‌లోని Indian Embassy 8వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాయబార కార్యాలయంలో నేడు(మంగళవారం) ప్రత్యేక వేడుక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కామన్ యోగా ప్రొటోకాల్ ప్రకారం ఈ సెషన్ భారత ఎంబసీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం దురదర్శన్-డీడీ ఇండియాలో ఉదయం 5.30 గంటలకు(కువైత్ కాలమానం ప్రకారం) ప్రత్యక్షప్రసారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈ వేడుక సందర్భంగా ఎంబసీ హెర్బల్ ప్లాంట్స్ ఎగ్జిబిషన్, ఆయుర్వేద ఎగ్జిబిషన్, టీ టేస్టింగ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇక యోగా డే కార్యక్రమానికి కువైత్‌లోని భారతీయ ప్రవాసులందరూ ఆహ్వానితులే. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రంలో పాల్గొనచ్చు. https://forms.gle/rsfjmN7TMrusoHyv8 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాల్గొనేవారు యోగాభ్యాసానికి సరిపోయే సౌకర్యవంతమైన దుస్తులలో ఉదయం 5:00 గంటలకు ఎంబసీ ప్రాంగణానికి చేరుకోవాలని కార్యాలయ అధికారులు తెలియజేశారు. 

Updated Date - 2022-06-21T14:56:26+05:30 IST