కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-07-28T20:42:07+05:30 IST

కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జి ఆధ్వర్యంలో ఈ రోజు (జులై 28, బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు వర్చువల్ విధానంలో ఓపె

కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన

కువైత్ సిటీ: కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జి ఆధ్వర్యంలో ఈ రోజు (జులై 28, బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు వర్చువల్ విధానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చ జరుగుతందని ఎంబసీ పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో వచ్చిన ఆంక్షల కారణంగా కువైత్‌కు రాలేకపోతున్న భారతీయులు.. తమ సందేహాలను ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తపర్చొచ్చని తెలిపింది.


అంతేకాకుండా ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్(ఐసీడబ్ల్యూఎఫ్), కువైత్‌లో చనిపోయిన భారతీయుల మరణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ‌కు సంబంధించిన అంశాలపై సిబి జార్జి మాట్లాడతారని పేర్కొంది. పాస్‌పోర్ట్ నెబర్, సివిల్ ఐడీ నెంబర్, పేరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలను community.kuwait@mea.gov.in మెయిల్ చేయడం ద్వారా కూడా సమస్యలను ఎంబసీ దృష్టికి తీసుకురావొచ్చని భారతీయులకు సూచించింది. https://zoom.us/j/99978993243?pwd=YUthQlJJcnB1VXo2NHAxc2xpNFlMZz09 లింక్ ద్వారా Meeting ID:999 7899 3243, Passcode:512609ను ఉపయోగించి ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనొచ్చని వెల్లడించింది.


Updated Date - 2021-07-28T20:42:07+05:30 IST