ఆఫ్ఘాన్‌లో రెచ్చిపోతున్న తాలిబన్ ఉగ్రవాదులు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన

ABN , First Publish Date - 2021-07-25T02:13:59+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా, నాటో దళాలు క్రమంగా వెనుతిరుగుతున్నాయి. ఈ క్రమంలో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పౌరుల ఇళ్లపై కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ నివసి

ఆఫ్ఘాన్‌లో రెచ్చిపోతున్న తాలిబన్ ఉగ్రవాదులు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా, నాటో దళాలు క్రమంగా వెనుతిరుగుతున్నాయి. ఈ క్రమంలో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పౌరుల ఇళ్లపై కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రత దృష్ట్యా ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం అఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని పేర్కొంది. ‘ఆఫ్ఘనిస్థాన్‌లోని అనేక ప్రావిన్సులలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. భద్రత పూర్తిగా లోపించింది. టెర్రర్ గ్రూపులు పౌరులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలను పెంచాయి. భారతీయ పౌరులపై కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. కిడ్నాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి’ అని తెలిపింది.


అంతేకాకుండా ‘రహదారులపై ప్రయాణించే సమయంలో సైనిక కాన్వయ్‌లు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / కార్యాలయాల వాహనాలకు దూరంగా ఉండాలని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపే అవకాశం ఉన్నందున అటువంటి ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండటం మేలు. రద్దీగా ఉండే మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్, మండీలు, రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాలను సందర్శించవద్దు’ అని సూచించింది.


Updated Date - 2021-07-25T02:13:59+05:30 IST