కాన్సుల‌ర్ స‌ర్వీసులను నిలిపివేసిన‌ కువైట్‌లోని భార‌త ఎంబ‌సీ!

ABN , First Publish Date - 2021-06-25T14:36:34+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కువైట్‌లోని భార‌త ఎంబ‌సీ జూలై 1 వ‌ర‌కు కాన్సుల‌ర్ స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

కాన్సుల‌ర్ స‌ర్వీసులను నిలిపివేసిన‌ కువైట్‌లోని భార‌త ఎంబ‌సీ!

కువైట్ సిటీ: మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కువైట్‌లోని భార‌త ఎంబ‌సీ జూలై 1 వ‌ర‌కు కాన్సుల‌ర్ స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే, అత్యావ‌స‌ర కాన్సుల‌ర్ స‌ర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయ‌ని రాయ‌బార కార్యాల‌యం తెలిపింది. ఎమ‌ర్జెన్సీని బ‌ట్టి ప్ర‌వాసుల‌కు ఈ కాన్సుల‌ర్ సేవ‌ల కోసం అపాయింట్‌మెంట్ ఇవ్వ‌బ‌డుతుంద‌ని ఎంబ‌సీ అధికారులు వెల్ల‌డించారు. కాగా, వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌లో భాగంగా ఎంబ‌సీ ఇలా కాన్సుల‌ర్ స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌డం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. భార‌త ప్ర‌వాసులు ఎవ‌రైనా ఎమ‌ర్జెన్సీ కాన్సుల‌ర్ స‌ర్వీసుల కోసం cons1.kuwait@mea.gov.in మెయిల్ ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని రాయ‌బార కార్యాల‌యం పేర్కొంది. మూడు పాస్‌పోర్టు కేంద్రాల్లో యధావిధిగా పాస్‌పోర్టు సేవ‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఇక ఎంబ‌సీ ఆధ్య‌ర్యంలో జ‌రిగే ఇత‌ర‌ కార్య‌క్ర‌మాలు వ‌చ్చే రెండు వారాల త‌ర్వాత రీషెడ్యూల్ చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలియ‌జేశారు. 

Updated Date - 2021-06-25T14:36:34+05:30 IST