మరో మూడు దశాబ్దాల్లో... 30 లక్షల కోట్ల డాలర్లకు... భారత ఆర్థిక వ్యవస్థ - పీయూష్ గోయల్

ABN , First Publish Date - 2022-06-27T01:47:15+05:30 IST

తిరుప్పూర్ గ్లోబల్ అపెరల్ హబ్‌గా మారిందని, 37 ఏళ్ల క్రితం రూ. 15 కోట్లుగా ఉన్న ఎగుమతులు... ఇప్పుడు రూ. 30 వేల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

మరో మూడు దశాబ్దాల్లో...  30 లక్షల కోట్ల డాలర్లకు... భారత ఆర్థిక వ్యవస్థ  - పీయూష్ గోయల్

న్యూఢిల్లీ : తిరుప్పూర్ గ్లోబల్ అపెరల్ హబ్‌గా మారిందని, 37 ఏళ్ల క్రితం రూ. 15 కోట్లుగా ఉన్న ఎగుమతులు... ఇప్పుడు రూ. 30 వేల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు 3.2 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని, రానున్న పదేదేళ్లలో అది 6.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారత్‌ ఒకటని, రానున్న 30 ఏళ్లలో ఇది 30 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని గోయల్‌ ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో  తెలిపారు.


వార్షిక వృద్ధి ప్రాతిపదికన భారత్ ప్రతి సంవత్సరం 8 శాతం వృద్ధిని సాధిస్తే, దాదాపు తొమ్మిదేళ్లలో ఆర్థిక వ్యవస్థ రెట్టింపవుతుందని పీయూష్ పేర్కొన్నారు. “మరో తొమ్మిదేళ్లు, అంటే ఇప్పటి నుండి 18 సంవత్సరాల్లో 13 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్ ఉంటుందని గోయల్ పేర్కొన్నారు. అటుపై మరో తొమ్మిదేళ్ల తర్వాత, అంటే ఇప్పటికి 27 ఏళ్ల తర్వాత... భారత్ 26 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా  భారత్ రూపుదిద్దుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య సంక్షోభం, కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో కూడా  ప్రస్తుత సవాలు సమయాల్లో కూడా దేశ ఆర్థికవ్యవస్థ ఆరోగ్యకరమైన వేగంతో అభివృద్ధి చెందుతోందని గోయల్ అన్నారు. యుద్ధం ప్రపంచ మార్కెట్లలో కొన్ని వస్తువుల కొరతకు దారితీసిందని గోయల్ వెల్లడించారు.


ఇది ప్రపంచ ద్రవ్యోల్బణాన్ని పెంచిందని పేర్కొన్నారు, అయితే భారత్ తన ద్రవ్యోల్బణాన్ని సహేతుకమైన స్థాయిలో నిర్వహించగలిగిందని మంత్రి పేర్కొన్నారు. ఇక... అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే "చాలా వస్తువుల కోసం, చాలా మెరుగ్గా ధరలను నిర్వహించగలిగామని మంత్రి వ్యాఖ్యానించారు. టెక్స్‌టైల్స్ పరిశ్రమ గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం పరిశ్రమ పరిమాణం రూ. 10 లక్షల కోట్లు కాగా, ఎగుమతులు రూ. 3.5 లక్షల కోట్లు అని వెల్లడించారు. దేశంలో ఇలాంటి 75 టెక్స్‌టైల్ నగరాలను సృష్టించాల్సిన అవసరం ఉందని, టెక్స్‌టైల్స్ పోర్ట్‌ఫోలియోను కూడా నిర్వహిస్తోన్న గోయల్... టెక్స్‌టైల్స్ పరిశ్రమలో భారీ ఉద్యోగావకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘టెక్స్‌టైల్స్ రంగంలో భారీ ఉద్యోగ, పెట్టుబడి అవకాశాలు సృష్టించవచ్చు. ఈ రంగంలో అపారమైన అవకాశాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-06-27T01:47:15+05:30 IST