Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బహ్రెయిన్‌లో భారతీయ రెస్టారెంట్‌కు షాక్..! హిజాబ్ ధరించిన మహిళను లోపలికి రానివ్వనందుకు..

twitter-iconwatsapp-iconfb-icon
బహ్రెయిన్‌లో భారతీయ రెస్టారెంట్‌కు షాక్..! హిజాబ్ ధరించిన మహిళను లోపలికి రానివ్వనందుకు..

ఎన్నారై డెస్క్: హిజాబ్ ధరించిన మహిళను లోపలికి అనుమతించని ఓ రెస్టారెంట్‌కు బహ్రెయిన్ అధికారులు తాజాగా భారీ షాకిచ్చారు. వివాక్షపూరిత చర్యలు చేపట్టినందుకు ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు. బహ్రెయిన్‌ రాజధాని మనామా నగరంలోని అదిల్యా ప్రాంతంలో గల లాంటర్న్స్ రెస్టారెంట్‌లో ఇటీవల ఈ ఉదంతం వెలుగు చూసింది. మరోవైపు..  బహ్రెయిన్ పర్యటక శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ‘‘వివక్షాపూరిత చర్యలను మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా తమ జాతీయతను ప్రదర్శించే వారిపై ఇటువంటి చర్యలు అస్సలు సహించం’’ అని అక్కడి అధికారి ఒకరు పేర్కొన్నారు. 

మరోవైపు.. రెస్టారెంట్ యాజమాన్యం కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ ఘటనకు బాధ్యుడైన మేనేజర్ మార్చి 24నే విధుల నుంచి తొలగించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా.. మార్చి 29న తమ రెస్టారెంట్లో బాహ్రెయిన్ వాసులకు ఆహారాన్ని కాంప్లిమెంటరీగా ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. ‘‘బాహ్రెయిన్‌లో గత 35 ఏళ్లుగా మేము అన్ని దేశాల వారికీ ఆతిథ్యం ఇస్తున్నాం. ఇకపై కూడా ఇదే విధానం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ లాంటర్న్స్‌కు వచ్చి సంతోషంగా ఉల్లాసంగా గడపాలి. అయితే.. ఓ మేనేజర్ కారణంగా ఈసారి పొరపాటు జరిగింది. అతడి తీరు మా రెస్టారెంట్ విధానానికి పూర్తిగా విరుద్ధం. ఈ సందర్భంగా.. మా రెస్టారెంట్ పాట్రన్‌లకు మరోమారు స్నేహహస్తం అందిస్తూ.. మార్చి 29న మేము కాంప్లిమెంటరీగా ఆహారాన్ని సర్వ్ చేయదలిచాము.’’ అని రెస్టారెంట్ తన ప్రకటనలో పేర్కొంది.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.