యూఎస్‌లో భారతీయ ఉబెర్ డ్రైవర్‌ నిర్వాకం.. ఏడాది జైలు

ABN , First Publish Date - 2020-02-14T20:00:45+05:30 IST

కెనడియన్ సరిహద్దు నుండి చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన వ్యక్తులను రవాణా చేసినందుకు భారతీయ ఉబెర్ డ్రైవర్‌కు గురువారం న్యూయార్క్‌లోని ఉటిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.

యూఎస్‌లో భారతీయ ఉబెర్ డ్రైవర్‌ నిర్వాకం.. ఏడాది జైలు

న్యూయార్క్: కెనడియన్ సరిహద్దు నుండి చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన వ్యక్తులను రవాణా చేసినందుకు భారతీయ ఉబెర్ డ్రైవర్‌కు గురువారం న్యూయార్క్‌లోని ఉటిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే అతను దేశ బహిష్కరణకు కూడా గురయ్యే అవకాశం ఉందని ఫెడరల్ ప్రాసిక్యూటర్ గ్రాంట్ జాక్విత్ పేర్కొన్నారు.


వివరాల్లోకి వెళ్తే... భారత్‌కు చెందిన జస్వీందర్ సింగ్(30) అనే వ్యక్తి న్యూయార్క్‌లో ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సులువుగా సంపాదించేందుకు అలవాటు పడిన జస్వీందర్ 2019 జనవరి నుంచి మే వరకు కెనడియన్ సరిహద్దు నుండి చట్టవిరుద్ధంగా యూఎస్‌లోకి ప్రవేశించిన చాలా మందిని తన కారులో రవాణా చేశాడు. ఇలా భారీ నగదుకు ఆశపడి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని రవాణా చేస్తూ జస్వీందర్ గతేడాదిలో మేలో పోలీసులకు పట్టుబడ్డాడు.


తాను మాట్లాడుకున్న ఇద్దరు వ్యక్తులను కెనడియన్ బార్డర్ వద్ద పికాప్ చేసుకునేందుకు వెళ్లిన సందర్భంలో పోలీసులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను రవాణా చేసేందుకు అతను 2200 డాలర్లు(రూ.1,56,968) తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గురువారం ఈ కేసు న్యూయార్క్‌లోని ఉటిక న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. విచారణలో దోషిగా తేలిన జస్వీందర్‌కు న్యాయమూర్తి డేవిడ్ హర్డ్ ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.   

Updated Date - 2020-02-14T20:00:45+05:30 IST