ఈ భారత సంతతి వైద్యుడు.. ఫొటోలో కనిపిస్తున్నట్టు అమాయకుడేం కాదు.. అతడు చేసిన పనికి కోర్టు 4ఏళ్ల జైలుశిక్ష విధించింది

ABN , First Publish Date - 2022-06-16T14:58:09+05:30 IST

పైన ఫొటోలో ఉన్న వ్యక్తి.. కనిపిస్తున్నంత అమాయకుడేం కాదు. లండన్‌లో వైద్యుడి పని చేస్తున్న ఇతడు.. వక్రబుద్ధితో ఆలోచించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు.. దాదాపు మూ

ఈ భారత సంతతి వైద్యుడు.. ఫొటోలో కనిపిస్తున్నట్టు అమాయకుడేం కాదు.. అతడు చేసిన పనికి కోర్టు 4ఏళ్ల జైలుశిక్ష విధించింది

ఎన్నారై డైస్క్: పైన ఫొటోలో ఉన్న వ్యక్తి.. కనిపిస్తున్నంత అమాయకుడేం కాదు. లండన్‌లో వైద్యుడి పని చేస్తున్న ఇతడు.. వక్రబుద్ధితో ఆలోచించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు.. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని దోషిగా తేల్చింది. నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కాగా.. అతడు చేసిన నేరం ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..



మనేష్ గిల్ అనే భారత సంతతి వైద్యడికి ప్రస్తుతం 39ఏళ్లు. ఇదివరకే అతడికి పెళ్లి కూడా అయింది. అయినా.. 2018లో ఫేక్ ఐడెంటిటితో టిండర్ అనే యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అందులో నర్సింగ్ చదువుతున్న ఓ యువతికి పరిచయం అయ్యాడు. 2018 డిసెంబర్‌లో ఆమెకు మాయమాటలు చెప్పి హోటల్‌కు రప్పించాడు. అనంతరం హోటల్ గదిలో ఆమెపై లైగింక దాడికి పాల్పడ్డాడు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసిన అధికారులు.. మనేష్ గిల్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరపర్చారు. మూడేళ్ల సుదీర్ఘ వాదనల తర్వాత లండన్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అంతేకాకుండా మనేష్ గిల్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్కాటిష్ కోర్టు బుధవారం రోజు తీర్పు చెప్పింది. 


Updated Date - 2022-06-16T14:58:09+05:30 IST