Abn logo
Sep 25 2021 @ 21:04PM

UNGA: పాకిస్తాన్‌ని ఉతికి ఆరేసిన స్నేహా దుబే

న్యూఢిల్లీ : యువ భారతీయ దౌత్యవేత్త స్నేహ దుబే పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చుక్కలు కనిపించేలా చేశారు. ఐక్య రాజ్య సమితి సాధారణ సభ (యూఎన్‌జీఏ)లో ఇమ్రాన్ మాట్లాడుతూ కశ్మీరు అంశాన్ని లేవనెత్తడంతో, అందుకు సమాధానం చెప్పేందుకు భారతదేశానికిగల హక్కును వినియోగించుకుంటూ స్నేహ మాట్లాడారు. 


అగ్ని ప్రమాదాన్ని ఆర్పే అగ్నిమాపక సిబ్బంది ముసుగులో ఉన్న దహనకారి పాకిస్థాన్ అని స్నేహ దుబే మండిపడ్డారు. పాకిస్థాన్ తన పెరట్లో ఉగ్రవాదులను పోషిస్తోందని, దాని విధానాల వల్ల యావత్తు ప్రపంచం బాధపడుతోందని చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరును వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. 


జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారత దేశంలో అంతర్భాగమని, ఇవి విడదీయరానివని, అవి అలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించినవారిలో అత్యధిక ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తోందని, ఇది అత్యంత నీచమైన రికార్డు అని దుయ్యబట్టారు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందాడన్నారు. నేటికీ లాడెన్‌ను అమరుడిగా పాకిస్థాన్ నాయకత్వం కీర్తిస్తోందన్నారు. 


స్నేహ దుబే 2012 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్.  తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీ పరీక్షల్లో విజయం సాధించారు. పన్నెండేళ్ళ వయసు నుంచి ఐఎఫ్ఎస్ అధికారినికావాలని కలలుగనేవారు. ఆమెకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ వ్యవహారాలపై మక్కువ ఎక్కువ. ఆమె తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగి. స్నేహ మ్యాడ్రిడ్‌లో భారత ఎంబసీలో థర్డ్ సెక్రటరీగా చేశారు. అంతకుముందు ఆమె విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అండర్ సెక్రటరీగా పని చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

జాతీయంమరిన్ని...