భారతీయ సంస్కృతి చాలా గొప్పది

ABN , First Publish Date - 2021-01-27T06:58:33+05:30 IST

ప్రపంచంలోనే భారతీయ సంస్కృతికి గొప్పస్థానం ఉందని త్రిదండి చినజీయర్‌ పేర్కొన్నారు.

భారతీయ సంస్కృతి చాలా గొప్పది
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన చినజీయర్‌

త్రిదండి చిన జీయర్‌


చిత్తూరు కల్చరల్‌, జనవరి 26: ప్రపంచంలోనే భారతీయ సంస్కృతికి గొప్పస్థానం ఉందని త్రిదండి చినజీయర్‌ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరులోని కట్టమంచి వెంకుసా కళ్యాణ మండపంలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కల్యాణ మండపంలో సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్వధర్మ ఆచరణ - బంధు సమ్మేళనం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్‌ మాట్లాడుతూ.. పురాతన కట్టడాలు, ఆలయాలు, ప్రార్థన మందిరాలను ధ్వంసం చేయడమంటే మన సంస్కృతిని మనమే నాశనం చేసుకున్నట్లు అన్నారు. ఇది మంచిది కాదన్నారు. అహోబిలం పీఠాధిపతి రామానుజ జీయర్‌ మాట్లాడుతూ.. మనదేశంలో ఉన్నటువంటి భిన్నమతాలు, సంస్కృతులు మరెక్కడా ఉండవన్నారు. అటువంటి సంస్కృతులకు ప్రతిరూపాలైన ప్రాంతాలను, కట్టడాలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. సమరసతా ఫౌండేషన్‌, వాసవీ, లయన్స్‌ క్లబ్‌ సభ్యుల కుటుంబీకులు జీయర్ల ఆశీర్వచనాలు పొందారు.

Updated Date - 2021-01-27T06:58:33+05:30 IST