Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 26 Jan 2022 19:49:23 IST

’తగ్గేదేలే’ అంటోన్న హార్దిక్ పాండ్యా.. ‘శ్రీ వల్లీ’ పాటకు ఎవరితో స్టెప్పులేశాడంటే..

twitter-iconwatsapp-iconfb-icon
తగ్గేదేలే అంటోన్న హార్దిక్ పాండ్యా.. శ్రీ వల్లీ పాటకు ఎవరితో స్టెప్పులేశాడంటే..

‘పుష్ప’ మేనియా ఇప్పట్లో తగ్గెల కనిపించడం లేదు. ఆ సినిమా విడుదలైన దగ్గరి నుంచి క్రికెటర్లలందరూ హడావుడి చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘శ్రీ వల్లీ’ పాటకు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. డ్వేన్ బ్రావో కూడా ఆ పాటకు స్టెప్పులేశాడు. తాజాగా భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడు తన నాన్నమ్మతో కలిసి ఆ పాటకు స్టెప్పులేశాడు. ‘‘మా పుష్ప నానమ్మ’’ అంటూ కామెంట్ రాశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా కామెంట్ చేస్తన్నారు. దాదాపుగా 16లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు.  


‘పుష్ప: పార్ట్-1’‌లో అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాకు లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement