దుబాయ్‌లోని Indian Consulate కీలక ప్రకటన.. జూన్ 26న ప్రవాసులు సిద్ధంగా ఉండాలంటూ..

ABN , First Publish Date - 2022-06-19T14:07:52+05:30 IST

దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రవాసుల అభ్యర్థన మేరకు జూన్ 26న పాస్‌పోర్ట్ సర్వీస్ శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

దుబాయ్‌లోని Indian Consulate కీలక ప్రకటన.. జూన్ 26న ప్రవాసులు సిద్ధంగా ఉండాలంటూ..

దుబాయ్: దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రవాసుల అభ్యర్థన మేరకు జూన్ 26న పాస్‌పోర్ట్ సర్వీస్ శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దుబాయ్‌తో పాటు నార్తర్న్ ఎమిరేట్స్‌లోని 12 బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ సర్వీస్ లిమిటెడ్ సెంటర్స్‌లో ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ప్రవాసులు పాస్‌పోర్ట్, దాని సంబంధిత సమస్యలను దీని ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొంది. "ప్రవాస భారతీయుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని పాస్‌పోర్ట్, దాని సంబంధిత సేవల డిమాండ్‌ను తీర్చడానికి ఈ పాస్‌పోర్ట్ సేవా శిబిరం నిర్వహించబడుతుంది" అని  భారత కాన్సుల్ మీడియాకు తెలిపింది. 


కాగా, ఈ సర్వీస్‌ను ఉపయోగించుకునేందుకు దరఖాస్తుదారులు ముందుగానే బీఎల్ఎస్ వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అపాయింట్‌మెంట్‌లో పేర్కొన్న సమయానికి సంబంధిత బీఎల్ఎస్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు సమయంలో దానికి సరిపోయే ధృవపత్రాలను కూడా జతచేయాలి. తద్వారా పాస్‌పోర్ట్, దాని సంబంధిత సమస్యలను ప్రవాసులు పరిష్కరించుకోవచ్చు. 


వాక్-ఇన్లు

ఇక ధృవపత్రాలతో కూడిన కొన్ని కేసులు వాక్-ఇన్‌లుగా(నేరుగా సర్వీస్ పొందేందుకు) అంగీకరించబడతాయని ఈ సందర్భంగా భారతీయ మిషన్ తెలిపింది. 'తత్కాల్' కేసులు, అత్యవసర కేసులు (వైద్య చికిత్స, మరణం), కొత్తగా పుట్టిన బిడ్డ, సీనియర్ సిటిజన్లు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు, అవుట్ పాస్‌లు. ఏవైనా సందేహాల ఉంటే.. ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం టోల్ ఫ్రీ నంబర్: 80046342 లేదా passport.dubai@mea.gov.in; vcppt.dubai@mea.gov.inకు ఈ-మెయిల్ చేయవచ్చు. 




Updated Date - 2022-06-19T14:07:52+05:30 IST