Vatican News : భారతీయ సామాన్యుడు లాజరస్‌కు సెయింట్‌హుడ్

ABN , First Publish Date - 2022-05-15T21:12:02+05:30 IST

18వ శతాబ్దంలో క్రైస్తవ మతంలోకి మారిన దేవసహాయం వురపు లాజరస్‌కు

Vatican News : భారతీయ సామాన్యుడు లాజరస్‌కు సెయింట్‌హుడ్

చెన్నై : 18వ శతాబ్దంలో క్రైస్తవ మతంలోకి మారిన దేవసహాయం (Devasahayam) వురపు లాజరస్‌కు సెయింట్ హోదాను పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఆదివారం వాటికన్‌లొ ప్రకటించారు. సెయింట్ (Sainthood) హోదాను పొందిన తొలి భారతీయ సామాన్యుడు లాజరస్ కావడం విశేషం. హిందూ అగ్ర వర్ణంలో జన్మించిన ఆయన అసలు పేరు నీలకందన్ పిళ్ళయ్. ఆయన అప్పటి ట్రావన్‌కోర్ ఆస్థానంలో పని చేసేవారు. 


నీలకందన్ 1745లో క్రైస్తవ మతంలోకి మారి దేవసహాయం, లాజరస్ అని పేరు మార్చుకున్నారు. ఆయన కుల వివక్షకు (Casteism) వ్యతిరేకంగా పోరాడారు, ఆయన అణచివేతకు గురై, చివరికి హతులయ్యారు. ఆయన ప్రాణత్యాగాన్ని వాటికన్ 2012లో గుర్తించింది. 2013లో ఏడు నెలల గర్భిణి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ఆయనను సెయింట్‌హుడ్‌కు ఎంపిక చేసింది. తాను ఆయననను ప్రార్థించినపుడు అద్భుతం జరిగిందని ఆమె చెప్పింది. తన గర్భస్థ శిశువు మెడికల్లీ డెడ్ అని వైద్యులు చెప్పారని, అప్పుడు తాను ఆయనను ప్రార్థించానని, అనంతరం తాను తన గర్భంలో శిశువు కదలికను అనుభవించానని చెప్పింది. ఈ సాక్ష్యాన్ని వాటికన్ ఆమోదించి, దేవసహాయానికి సెయింట్‌హుడ్‌ ఇవ్వడానికి గుర్తింపునిచ్చింది. 


ఈ విషయంలో కృషి చేసిన కన్యాకుమారిలోని బృందం కీలక సభ్యుడు ఫాదర్ జాన్ కులండయ్ వాటికన్‌లో కెననైజేషన్‌కు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, వివక్ష రహిత జీవితాన్ని జీవించేందుకు తమకు ఈ సెయింట్‌హుడ్ ఓ ఆహ్వానమని తెలిపారు. ఇదిలావుండగా, వాటికన్ నుంచి వచ్చిన ఒరిజినల్ ఇన్విటేషన్‌లో దేవసహాయం కులం పేరు పిళ్ళయ్ అని ఉండేది. దీనిపై నిరసన వ్యక్తమవడంతో ఆ పేరును వాటికన్ తొలగించింది. 


దేవసహాయం కులం పేరును ఇన్విటేషన్ నుంచి తొలగించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు వాటికన్‌కు లేఖ రాశారు. ఆయన మాట్లాడుతూ, సెయింట్ దేవసహాయం సమానత్వం కోసం పోరాడారని, కులతత్వానికి, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ప్రస్తుతం భారత దేశంలో మతతత్వం పెరుగుతున్న సమయంలో ఆయనకు సెయింట్‌హుడ్ వచ్చిందన్నారు. 


Updated Date - 2022-05-15T21:12:02+05:30 IST