Abn logo
Sep 20 2021 @ 07:44AM

రూ. 8 కోట్ల విలువైన సముద్ర జీవులు స్వాధీనం

రామేశ్వరం: తమిళనాడు అటవీశాఖ, సముద్రతీర రక్షక దళం సంయుక్తంగా సుమారు రూ. 8 కోట్ల విలువైన సముద్ర జీవులు (సీ కుకుంబర్‌)ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ సముద్ర జీవులను అక్రమంగా శ్రీలంకకు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక పత్రికా ప్రకటనలో వారు ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ, తమకు అందిన రహస్య సమాచారం మేరకు సముద్ర తీర రక్షక బృందమొకటి.. అనుమానాస్పదంగా కనిపించిన నావను గుర్తించి అడ్డుకుందన్నారు. ఆ నావలో 200 డ్రమ్ములలో రెండు వేల కిలోల సీ కుకుంబర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి ఖరీదు రూ. 8 కోట్ల వరకూ ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నావ పంబన్ సమీపంలో అధికారులకు కనిపించింది. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...