విడాకులు తీసుకున్న సినీ జంటల లిస్ట్ ఇదీ.. నాగచైతన్య నుంచి అమీర్ ఖాన్ వరకు..

ABN , First Publish Date - 2021-10-03T00:28:31+05:30 IST

తాను, సమంత విడిపోతున్నట్టు నాగ చైతన్య ప్రకటించారు. ఇది నిజంగా బాధాకరమే. వారిద్దరూ టాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో ఒకరు. అభిమానులు వారి జంటని ఎంతగానో ఇష్టపడే వారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తప్పటం లేదు. అయితే, టాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా ఇండియన్ సినీ సెలబ్రిటీలకు డైవోర్స్ కొత్తేం కాదు.

విడాకులు తీసుకున్న సినీ జంటల లిస్ట్ ఇదీ.. నాగచైతన్య నుంచి అమీర్ ఖాన్ వరకు..

తాను, సమంత విడిపోతున్నట్టు నాగ చైతన్య ప్రకటించారు. ఇది నిజంగా బాధాకరమే. వారిద్దరూ టాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో ఒకరు. అభిమానులు వారి జంటని ఎంతగానో ఇష్టపడే వారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తప్పటం లేదు. అయితే, టాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా ఇండియన్ సినీ సెలబ్రిటీలకు డైవోర్స్ కొత్తేం కాదు. నాగ చైతన్య తండ్రి నాగార్జున కూడా మొదటి వివాహం రద్దు చేసుకుని రెండో భార్యగా అమలని తన జీవితంలోకి ఆహ్వానించారు. మరో అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ కూడా హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లాడి, విడిపోయారు. టాలీవుడ్ డైవోర్స్ లిస్టులో పవర్ స్టార్ పేరు కూడా చెప్పుకోక తప్పదు. ఆయన రెండు సార్లు వివాహ బంధాన్ని తెంచుకోవాల్సి వచ్చింది... 


తెలుగు సినిమా తారల సంగతి ఎలా ఉన్నా బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో కూడా విడాకుల సంప్రదాయం గ్లామర్ ప్రపంచంలో ఉంది. ఇందుకు ప్రఖ్యాత ఉదాహరణ, విలక్షణ నటుడు కమల్ హాసన్. ఆయన మొదటి భార్య వాణీ గణపతికి విడాకులిచ్చి శ్రుతీ హాసన్, అక్షర హాసన్ తల్లి అయిన సారికని పెళ్లాడారు. ఆమెకు కూడా డైవోర్స్ ఇచ్చి చాలా కాలం గౌతమితో సహ జీవనం చేశారు. ప్రస్తుతం లెజెండ్రీ యాక్టర్ సింగిల్‌గానే ఉంటున్నారు... 


సౌత్‌లో బాగా చర్చకు దారి తీసిన మరో సినీ డైవోర్స్ ప్రభుదేవది. ఆయన కూడా మొదటి భార్య రమాలత నుంచీ అనేక వివాదాల నడుమ విడాకులు తీసుకున్నాడు. నయనతారతో ప్రభు సహ జీవనం పెద్ద రచ్చకి దారి తీసింది. కానీ, భార్యకి విడాకులిచ్చిన టాలెంటెడ్ కొరియోగ్రఫర్ నయన్‌ని కూడా పెళ్లాడలేదు. వాళ్ల డేటింగ్ అర్ధాంతరంగా ముగిసింది. తరువాత నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో రిలేషన్ కొనసాగిస్తుండగా ప్రభుదేవ పోయిన యేడాది డాక్టర్ హిమానీని వివాహమాడారు... 


దక్షిణాదికన్నా ముంబైలో డైవోర్స్‌ల తీవ్రత ఎక్కువనే చెప్పాలి. ఇలా పెళ్లి చేసుకుని అలా విడిపోయిన వారే కాదు, ఎన్నో ఏళ్లు, కాపురం చేసి కూడా గుడ్ బై చెప్పేసిన ప్రేమ పక్షులు మనకు కనిపిస్తారు. హృతిక్ రోషన్, సుజానే ఖాన్ 14 ఏళ్ల తరువాత.. ఇద్దరు కొడుకులు పుట్టాక.. విడిపోయారు. అయితే, వీరిద్దరు మళ్లీ వేరే వాళ్లని పెళ్లి చేసుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినా పిల్లల కోసం తల్లిదండ్రులుగా అన్యోన్యంగా కొనసాగుతున్నారు. కొడుకులిద్దర్నీ తీసుకుని అప్పుడప్పుడూ వెకేషన్స్‌కి కూడా వెళ్లి వస్తుంటారు, హృతిక్ అండ్ సుజానే!


ఒకటి, రెండు కాదు ఏకంగా 18 ఏళ్లు వైఫ్ అండ్ హజ్బెండ్‌గా కొనసాగారు అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా. కానీ, ఓ కొడుక్కి తల్లిదండ్రులయ్యాక కోర్టు మెట్లెక్కి డైవోర్స్ తీసేసుకున్నారు. ఇప్పటికీ వారసుడి కోసం అప్పుడప్పుడూ కలసి హోటల్స్‌లో డిన్నర్ డేట్స్‌కు వెళుతుంటారు మమ్మీ మలైకా అండ్ డాడీ అర్భాజ్. భార్యాభర్తలుగా మాత్రం వీరు మెలగటం లేదు. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో మలైకా సహ జీవనం చేస్తుండగా.. అర్భాజ్ ఖాన్ ఇటాలియన్ గాళ్‌ఫ్రెండ్ జార్జియా ఆండ్రియానితో రొమాన్స్‌లో బిజీగా ఉన్నాడు..



సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ జోడీ ఇప్పుడు కాదు... 1990లలోనే పెద్ద సంచలనం! 91లో తనకంటే వయస్సులో పెద్దదైన అమృతని పెళ్లాడిన సైఫ్... 2004లో విడాకులిచ్చేశాడు. అప్పటికి వారికి ఒక కొడుకు, ఒక కూతురు. ఆ తరువాత, సైఫ్ తనకంటే చాలా చిన్నదైన కరీనాని పెళ్లాడటం మనందరికీ తెలిసిందే. బెబో ద్వారా మరో ఇద్దరు బిడ్డలకి తండ్రైన నవాబ్ సాబ్ మొత్తం నలుగురు పిల్లలకి జన్మనిచ్చాడు! వారిలో అందరికంటే పెద్దదైన సారా అలీఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ బ్యూటీస్‌లో ఒకరు..


ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ కొడుకు ఫర్హాన్ అఖ్తర్. నటుడు, దర్శకుడు కూడా అయిన ఈయన 16 ఏళ్ల వైవాహిక జీవితాన్ని 2017లో తెంచుకున్నాడు. భార్య అధునా బబానీకి బైబై చెప్పి టాప్ మోడల్ అండ్ వీజే శిబానీ దందేకర్‌తో ప్రస్తుతం లివిన్ రిలేషన్ కొనసాగిస్తున్నాడు..


మహేశ్ భట్ కూతురు, ఆలియా భట్ సోదరి పూజా భట్. ఈమె కూడా 11 ఏళ్ల కాపురం తరువాత భర్త మనీశ్ మఖీజాతో రిలేషన్‌షిప్ నుంచీ లాగవుట్ చేసేసింది! పరస్పర అంగీకారంతో వీరు ఎవరి దారిలో వారు ముందుకు సాగిపోయారు..


బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ పెళ్లి విషయంలో మాత్రం పర్ఫెక్ట్ కాదు. ఒకటికి రెండుసార్లు విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచాడు. మొదటి భార్య రీనా దత్తాకి డైవోర్స్ ఇచ్చిన ఆయన రీసెంట్‌గా రెండో భార్య కిరణ్ రావుకి కూడా తలాఖ్ ఇచ్చేశారు. అయితే, ఆమీర్ ఖాన్, కిరణ్ తమ కొడుకు ఆజాద్ సంరక్షణ మాత్రం కలిసే చేయనున్నారు. తల్లిదండ్రులుగా, సినిమాల విషయంలో కలసి పని చేయటంలోనూ అంతా మామూలే అంటున్నారు ఈ మాజీ భార్యాభర్తలు! 


బాలీవుడ్‌లో అందర్నీ ఆశ్చర్యపరిచిన మరో సీనియర్ కపుల్... అర్జున్ రాంపాల్, మెహర్ జెసియా. వీళ్లు 21 ఏళ్లు కాపురం చేశాక కూడా జీవితాంతం కలసి ఉండలేకపోయారు. వాళ్లకంటే ఇంకాస్త సీనియర్స్ హిమేశ్ రేషిమియా, కోమల్. వీళ్లు 22 ఏళ్లు భార్యాభర్తలుగా కొనసాగి ‘ఇక మా వల్ల కాదు’ అంటూ విడిపోయారు! 


20 ఏళ్లు, 10 ఏళ్లు సంసారంలో మునిగిపోయిన దంపతులే విడిపోయినప్పుడు రెండు, మూడేళ్లకే విడాకులు తీసుకునే వార్ని ఏమనగలం? అనురాగ్ కశ్యప్, కల్కి కొచ్లిన్ 2011లో పెళ్లాడి 2013లో ‘క్విట్‘ అనేశారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గతంలో మరో వివాహం కూడా చేసుకున్నాడు. ఆయనకు మొదటి భార్య ద్వారా ఓ కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తుండటం విశేషం!


బాలీవుడ్‌లో ఒకటికి రెండు సార్లు విడాకులు తీసుకుని, మూడు సార్లు మూడు ముళ్లు వేసిన హీరోల్లో సంజయ్ దత్ పేరు కూడా తప్పక చెప్పుకోవాలి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఈయన రెండు సార్లు డైవోర్స్ కారణంగా వార్తల్లో నిలిచాడు. సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ, రెండో భార్య రియా పిల్లై. వారిద్దరి తరువాత మాన్యతని పెళ్లాడాడు ‘మున్నాభాయ్’!


ముంబై హీరోలే కాదు... హీరోయిన్స్ కూడా విడాకులు తీసుకుని వార్తల్లోకి ఎక్కిన సందర్భాలున్నాయి. కరిష్మా కపూర్ భర్త సంజయ్ కపూర్ నుంచీ 2014లో విడిపోయింది. మరో మాజీ బాలీవుడ్ సూపర్ స్టార్ మనీషా కోయిరాలా కూడా డైవోర్సీయే. ఆమె సమ్రాట్‌ను 2010లో పెళ్లాడి రెండేళ్లకే విడాకులిచ్చేసింది... 

     

Updated Date - 2021-10-03T00:28:31+05:30 IST