భారతీయుల చాయిస్‌ ఐఫోన్‌ 13

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

మార్కెట్‌లోకి వచ్చిన మూడు నెలల్లోనే ఐఫోన్‌ 13 కస్టమర్ల చాయిస్‌

భారతీయుల చాయిస్‌ ఐఫోన్‌ 13

 మార్కెట్‌లోకి వచ్చిన మూడు నెలల్లోనే ఐఫోన్‌ 13 కస్టమర్ల చాయిస్‌ మొబైల్‌గా మారింది. అందుకే అమెజాన్‌ కొనుగోళ్ళలో భారతీయ కస్టమర్లు ఐఫోన్‌ 13ని బెస్ట్‌ ఫోన్‌గా ఎంపిక చేశారు. మూడు నెలల స్వల్పకాలిక ఆఫర్‌లోనే సదరు ఫోన్‌ ఈ ఘనతను సాధించింది. అమెజాన్‌ కస్టమర్స్‌ చాయిస్‌ కింద ‘స్మార్ట్‌ ఫోన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నెగ్గుకు వచ్చింది. 13 సిరీస్‌లో సైతం మరో నాలుగు పురస్కారాలను అందుకుంది. ఐఫోన్‌ 13 మినీ ‘ప్రీమియర్‌ స్మార్‌ ఫోన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ కాగా 13 ప్రొ ‘అలా్ట్ర - ప్రీమియమ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికైంది. 


వనిల్లా ఫోన్‌ బెస్ట్‌ డిజైన్‌ అవార్డును అందుకుంది. అలాగే ‘గేమింగ్‌ స్మార్‌ ఫోన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పోటీలో రన్నరప్‌గా నిలిచింది. ఇతరులతో పోల్చుకుంటే అమెజాన్‌ పెద్దగా డిస్కౌంట్స్‌ ఇవ్వదని ఇక్కడ గుర్తించాలి. యాపిల్‌ ‘లవ్డ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా అవార్డు గెలుచుకుంది. యాపిల్‌ ఐపాడ్‌ ప్రొ ‘బెస్ట్‌ ట్రూ వైర్‌లెస్‌ బడ్‌’గా ఎంపికైంది. 


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST