Abn logo
Jan 15 2021 @ 21:38PM

భారత బౌలింగ్‌లో క్రమశిక్షణ ఉంది.. మెచ్చుకున్న ఆసీస్ స్టార్!

బ్రిస్బేన్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడారు. తొలి రోజు ఆట తర్వాత ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ లబుషేన్ మాట్లాడుతూ.. భారత బౌలింగ్ దళంపై ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో 108 పరుగులు చేసిన లబుషేన్.. భారత బౌలర్లు లూజ్ బాల్స్ చాలా తక్కువగా వేశారని మెచ్చుకున్నాడు. ‘‘ఎవరు బౌలింగ్ వేసినాగానీ.. వాళ్లు చాలా పద్ధతిగా, ప్రణాళిక ప్రకారమే బౌలింగ్ చేశారు. మొదట్లో మరీ క్రమశిక్షణతో వేశారు. అందుకే తొలి సెషన్లో సరిగా స్కోర్ చేసే అవకాశాలు దక్కలేదు’’ అని లబుషేన్ పేర్కొన్నాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.

Advertisement
Advertisement
Advertisement