గోపీచంద్‌.. కోచ్‌గా వైదొలగనున్నాడా?

ABN , First Publish Date - 2020-02-25T10:31:04+05:30 IST

భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ త్వరలో బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడా? ఇటీవల వివిధ సందర్భాల్లో ...

గోపీచంద్‌.. కోచ్‌గా  వైదొలగనున్నాడా?

ఒలింపిక్స్‌ తర్వాత ప్రకటన చేసే అవకాశం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ త్వరలో బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడా? ఇటీవల వివిధ సందర్భాల్లో గోపీ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.  మూడ్రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా.. దేశంలో బ్యాడ్మింటన్‌ అభివృద్ధి కీలక దశకు చేరుకుందని గోపీ అభిప్రాయపడ్డాడు. ‘2016 ఒలింపిక్స్‌ తర్వాత నాపై ఒత్తిడి, బాధ్యత పెరిగాయి. ప్రజల్లో పతకాలపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఆ అంచ నాలు చేరాలంటే అట్టడుగు స్థాయి నుంచి బ్యాడ్మిం టన్‌ను బలోపేతం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో సింధు, సైనాల వెంటుండి  శిక్షణ ఇవ్వలేకపో తున్నా. వారికి సమయం కేటాయించలేకపో తున్నా’ అని గోపీ అన్నాడు. సోమవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో గోపీ మాట్లాడుతూ.. ‘బ్యాడ్మింటన్‌లో భారత్‌ను తిరుగులేని శక్తిగా తయారు చేయడమే నా లక్ష్యం. ఒలింపిక్స్‌ తర్వాత మరిన్ని స్పోర్ట్స్‌ అకాడ మీలకు మెంటార్‌గా సేవలందించడానికి ప్రయ త్నిస్తా. కోచ్‌లకు ప్రణాళిక రూపకల్పన, స్పోర్ట్స్‌ సైన్స్‌పై అధ్యయనం చేసేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తా. 2004-05 మధ్య  కోచింగ్‌ ప్రారంభించిన ప్పుడు కోచ్‌, ట్రైనర్‌, ఫిజియో, ఎనలిస్ట్‌, మెంటార్‌.. ఇలా అన్ని బాధ్యతలను వన్‌మ్యాన్‌ ఆర్మీలా నిర్వర్తించేవాడిని. ఇప్పుడా  అవసరమే లేదు. సింధు, సైనా వంటి షట్లర్లు ప్రత్యేకంగా కోచింగ్‌ టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. నేను కోరుకునేది కూడా ఇదే. ప్రొఫెషనల్‌ కోచ్‌ల సంఖ్య పెరగాలి. మౌలిక వసతులనూ మెరుగుపర్చాలి. ఈ లక్ష్యాలతోనే కొద్ది రోజులుగా పనిచేస్తున్నా. ఒలింపిక్స్‌ అనంతరం వీటిపై దృష్టి కేంద్రీకరిస్తా’ అని చెప్పాడు. దేశంలో బ్యాడ్మింటన్‌ను కిందిస్థాయి నుంచి అభివృద్ధి చేయాలని భావిస్తున్న గోపీ.. జాతీయ చీఫ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అకాడమీలు నిర్వహిస్తున్న చేతన్‌ ఆనంద్‌, అనూప్‌ శ్రీధర్‌, జ్వాల వంటి మాజీలు ఒక్క తాటిపైకి వస్తే అందరితో కలిసి దేశంలో బ్యాడ్మింటన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో గోపీ ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2020-02-25T10:31:04+05:30 IST