కువైట్‌లోని భారతీయ సంఘాలకు ఎంబసీ కీలక సూచన

ABN , First Publish Date - 2020-09-22T17:51:56+05:30 IST

కువైట్‌లోని భారతీయ సంఘాలు, గ్రూపులకు భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక సూచన చేసింది.

కువైట్‌లోని భారతీయ సంఘాలకు ఎంబసీ కీలక సూచన

కువైట్ సిటీ: కువైట్‌లోని భారతీయ సంఘాలు, గ్రూపులకు భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక సూచన చేసింది. ఎంబసీలో రిజిస్టర్ చేసుకున్న సంఘాలు తమ ఆఫీస్ బేరర్లకు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా కోరింది. వారికి సంబంధించిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ అడ్రస్‌లను community.kuwait@mea.gov.inకు మెయిల్ చేయాలని సూచించింది. అలాగే భారతీయ సంఘాలు తమతో సంప్రదింపులు, అప్‌డేటెడ్ వివరాలు పంపించడానికి రాయబార కార్యాలయం కొన్ని ట్విట్టర్ అకౌంట్లను కూడా ఇచ్చింది. 

1. @indembkwt – Embassy of India, Kuwait 

2. @Indian_IPN – Indian Professionals Network (IPN) 

3. @IndianIbn – Indian Business Network (IBN) 

4. @indian_icn – Indian Cultural Network (ICN) 

5. @thematic_lib – EoI Kuwait, Thematic Library

Updated Date - 2020-09-22T17:51:56+05:30 IST