Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 17:31PM

సైనికులకు ఆర్మీ డే గిఫ్ట్

న్యూఢిల్లీ: ఆర్మీ డే సందర్భంగా ఇండియన్ ఆర్మీ తేలికైన, పర్యావరణ హితమైన యూనిఫామ్‌లను సైనికులకు అందించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారంతో 4 రకాల ఫ్యాబ్రిక్‌లను ఉపయోగించి 8 డిజైన్లలో వీటిని తయారు చేశారు. మొత్తం 13 సైజుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. క్లిష్టమైన, అననుకూల వాతావరణ పరిస్థితుల్లో సైనికులు తమను తాము కాపాడుకునేందుకు ఈ యూనిఫామ్‌లు ఉపయోగపడతాయి. కాటన్, పాలిస్టర్‌లను 70:30 నిష్పత్తిలో వాడుతూ వీటిని తయారుచేశారు. బరువు తక్కువగా ఉండటంతో పాటు త్వరగా తేమ ఆరేలా వీటిని రూపొందించారు. వేసవిలోనూ, శీతాకాలంలోనూ సౌకర్యంగా ఉండటం ఈ యూనిఫామ్‌ల ప్రత్యేకత.    


Advertisement
Advertisement