భారతీయ యాప్‌ల హవా

ABN , First Publish Date - 2020-07-06T08:29:33+05:30 IST

చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన తర్వాత.. వాటి ప్రత్యామ్నాయాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రధానంగా మన దేశ నెటిజన్లు ‘భారతీయ యాప్‌’లకే జైకొడుతున్నారు. దీంతో.. భారతీయ యాప్‌ల పరిశ్రమ అమెరికా, రష్యా, చైనా తర్వాత.. నాలుగో స్థానానికి ఎగబాకింది...

భారతీయ యాప్‌ల హవా

  • పెరుగుతున్న రోపోసో, చింగారీ, షేర్‌చాట్‌ డౌన్‌లోడ్లు
  • మొబైల్‌ యాప్స్‌ మార్కెట్లో నాలుగో స్థానానికి భారత్‌..!

చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన తర్వాత.. వాటి ప్రత్యామ్నాయాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రధానంగా మన దేశ నెటిజన్లు ‘భారతీయ యాప్‌’లకే జైకొడుతున్నారు. దీంతో.. భారతీయ యాప్‌ల పరిశ్రమ అమెరికా, రష్యా, చైనా తర్వాత.. నాలుగో స్థానానికి ఎగబాకింది. బెంగళూరు టెకీలు అభివృద్ధి చేసిన షేర్‌చాట్‌ ఏకంగా గంటకు 5 లక్షల డౌన్‌లోడ్లను నమోదు చేసుకుంది. చైనా యాప్‌ల బ్యాన్‌ ప్రకటన తర్వాత షేర్‌చాట్‌ను 1.5 కోట్ల మంది భారతీయులు కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీంతో.. ఆ యాప్‌ యూజర్ల సంఖ్య 15 కోట్లకు చేరుకుంది. అంటే.. భారత్‌లోని టిక్‌టాక్‌ యూజర్ల సంఖ్య కంటే ఇది 3 కోట్లు ఎక్కువ. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయ యాప్‌ అయిన రోపోసో, చింగారీలకు కూడా డిమాండ్‌ భారీగా పెరిగింది. రెండురోజుల్లో కోటి మంది యూజర్లు రోపోసోను ఇన్‌స్టాల్‌ చేసుకోగా.. చింగారీ తాజా డౌన్‌లోడ్ల సంఖ్య 78.4 లక్షలుగా నమోదైంది. చింగారీని గంటకు 3 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం గమనార్హం. మహీంద్రా గ్రూప్‌కు చెందిన గోసోషల్‌ యాప్‌ డౌన్‌లోడ్లలో 20ు పెరుగుదల నమోదైంది. దీంతోపాటు.. హ్యాప్‌ర్యాంప్‌, ట్రెల్‌ తదితర యాప్‌లకు డిమాండ్‌ పెరిగింది. 




భారతీయ యాప్‌లపై దృష్టి

చైనా యాప్‌లపై నిషేధం తర్వాత నెటిజన్లు భారతీయ యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో.. భారతీయ యాప్‌ల మార్కెట్‌ ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. 

-సెంట్రల్ డెస్క్

Updated Date - 2020-07-06T08:29:33+05:30 IST