Americaలో కనిపించకుండాపోయిన ఇండియన్ అమెరికన్.. ఆచూకీ తెలుసుకునేందుకు ప్రజల సాయం కోరుతున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-06-23T01:03:44+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో 18ఏళ్ల Indian American కనబడకుండాపోయాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కుర్రాడికి సంబంధించిన గుర్తులను తెలియడంతోపాటు ఫొటోను విడుదల చేసిన పోలీసులు.. ఎవరైన అతడిని చూస్తే

Americaలో కనిపించకుండాపోయిన ఇండియన్ అమెరికన్.. ఆచూకీ తెలుసుకునేందుకు ప్రజల సాయం కోరుతున్న పోలీసులు

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో 18ఏళ్ల Indian American కనబడకుండాపోయాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కుర్రాడికి సంబంధించిన గుర్తులను తెలియడంతోపాటు ఫొటోను విడుదల చేసిన పోలీసులు.. ఎవరైన అతడిని చూస్తే వెంటనే తమకు తెలియజేయాలని పేర్కొన్నారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మేరీల్యాండ్‌లోని మోంట్‌గోమేరీ కౌంటీ‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న 18ఏళ్ల ఇషాన్ భరద్వాజ్ ఈ నెల 20 నుంచి కనిపించకుండాపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు Maryland పోలీసులను ఆశ్రయించారు. తమ అబ్బాయి జాడ కనిపెట్టాలని విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు బ్రాస్ వీల్ రోడ్ 14300 బ్లాక్ ప్రాంతంలోని స్థానికులకు ఇషాన్ భరద్వాజ్ చివరి సారిగా కనపించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో మంగళవారం రోజు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇషాన్ భరద్వాజ్ కనిపించకుండాపోయిన సమయంలో వేసుకున్న డ్రెస్, అతడి ఆహార్య వివరాలను వెల్లడించడంతోపాటు.. ఫొటోను కూడా విడుదల చేసిన అధికారులు.. కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఇషాన్ భరద్వాజ్ కనిపిస్తే  (301) 279- 8000, (240) 773- 6237 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. కాగా.. కుమారుడు కనిపించకుండా పోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-06-23T01:03:44+05:30 IST