వాషింగ్టన్: దాదాపు రూ.150 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో ఓ భారతీయ అమెరికన్‌ను దోషిగా తేల్చింది అక్కడి న్యాయస్థానం. ఈ మేరకు బుధవారం తీర్పునిచ్చింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరవ్ సింగ్(26) అమెరికాలోని పెన్సిల్వేనియాలో నివశిస్తున్నాడు. మే 2020లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పీపీఈ కిట్లు అందిస్తానంటూ దాదాపు 10 మంది నుంచి 2మిలియన్ డాలర్లు(రూ.147 కోట్లకు పైగా) డబ్బులు తీసుకున్నాడు.
ఆ మొత్తానికి బదులు వాటికి బదులుగా పీపీఈ కిట్లు కొని పంపాల్సింది పోయి ఆ డబ్బును తన సొంత అవసరాలకు వినియోగించుకున్నాడు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు కోర్టుకెక్కారు. స్థానిక కోర్టులో కేసు విచరించిన న్యాయమూర్తి గౌరవ్‌జిత్ సింగ్‌ను దోషిగా తేల్చారు.
కాగా.. ఇంత భారీ ఫ్రాడ్ చేసిన గౌవర్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు లేదా, 2,50వేల డాలర్లు(రూ.1,84,35,750) ఫైన్‌గా చెల్లించాల్సి రావచ్చు. ఒకవేళ రెండూ ఒకేసారి కూడా విధించే అవకాశం లేదు.