White House స్టాఫ్ సెక్రెటరీగా భారతీయ అమెరికన్ నీరా టాండన్..!

ABN , First Publish Date - 2021-10-23T17:16:34+05:30 IST

భారతీయ అమెరికన్, పాలసీ నిపుణురాలు నీరా టాండన్‌(50)కు అగ్రరాజ్యం అమెరికాలో మరో కీలక పదవి దక్కింది.

White House స్టాఫ్ సెక్రెటరీగా భారతీయ అమెరికన్ నీరా టాండన్..!

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్, పాలసీ నిపుణురాలు నీరా టాండన్‌(50)కు అగ్రరాజ్యం అమెరికాలో మరో కీలక పదవి దక్కింది. అధ్యక్షుడు జో బైడెన్‌ ఆమెను శుక్రవారం వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రెటరీగా నామినేట్ చేశారు. నీరా ఎనిమిది నెలల క్రితమే డైరెక్టర్‌ ఆఫ్‌ ద వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌(ఓఎంబీ) పదవికి నామినేట్‌ అయ్యారు. అయితే, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్లు వ్యతిరేకించడంతో తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. తాజాగా నీరాను బైడెన్ వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రెటరీగా నామినేట్ చేయడం విశేషం. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లైన్‌కు ఆమె రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, ఈ అపాంయింట్‌మెంట్‌కు సెనేట్ ఆమోదం అవసరం లేదని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. 


కాగా, ప్రస్తుతం నీరా టాండన్ అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు యూఎస్‌ హెల్త్‌ డిపార్డ్‌మెంట్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ సీనియర్‌ అడ్వైజర్‌గానూ విధులు నిర్వర్తించారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సర్కార్ తీసుకొచ్చిన అఫర్డబుల్‌ కేర్‌ యాక్ట్‌ విధివిధానాలను ఖరారు చేయడానికి అమెరికా పార్లమెంట్‌తో కలిసి పనిచేశారు. ఒబామా, బైడెన్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు వారి తరపున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.

Updated Date - 2021-10-23T17:16:34+05:30 IST